తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan Rape Case : 20 మంది మహిళలపై గ్యాంగ్​ రేప్​.. అంగన్​వాడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి!

Rajasthan rape case : 20 మంది మహిళలపై గ్యాంగ్​ రేప్​.. అంగన్​వాడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి!

Sharath Chitturi HT Telugu

11 February 2024, 16:30 IST

google News
    • 20 women gang raped : రాజస్థాన్​లో.. 20మంది మహిళలు సామూహిక అత్యాచారానికి గురైనట్టు తెలుస్తోంది. అంగన్​వాడీ ఉద్యోగాలు ఇస్తామని పిలిపించిన ఇద్దరు.. వారిపై ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు సమాచారం. 
20 మంది మహిళలపై గ్యాంగ్​ రేప్​.. అంగన్​వాడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి!
20 మంది మహిళలపై గ్యాంగ్​ రేప్​.. అంగన్​వాడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి!

20 మంది మహిళలపై గ్యాంగ్​ రేప్​.. అంగన్​వాడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి!

20 women gang raped in Rajasthan : రాజస్థాన్​లో జరిగిన ఓ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 20మంది మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు! అంగన్​వాడీ ఉద్యోగాలు ఇస్తామని నిందితులు మోసం చేసి, వారిని గ్యాంగ్​ రేప్​ చేశారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి.. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారు.. సిరోహి మున్సిపల్​ కౌన్సిల్​ ఛైర్​పర్సన్​ మహేంద్ర మేవడ, మాజీ మున్సిపల్​ కౌన్సిల్​ కమిషనర్​ మహేంద్ర చౌదరి.

ఇదీ జరిగింది..

రాజస్థాన్​ పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకి వచ్చింది. కొన్ని నెలల క్రితం.. ఆమె, ఇంకొందరు మహిళలతో కలిసి.. అంగన్​వాడీలో పని చేసేందుకు సిరోహి ప్రాంతానికి వెళ్లింది. అక్కడే.. ఆ ఇద్దరు నిందితులను మహిళలు కలిశారు. వారు మంచిగా ప్రవర్తించి, మహిళలకు భోజనం పెట్టారు. వసతిని కల్పించారు.

కాగా.. భోజనం తిన్న తర్వాత ఇతరులతో పాటు తాను కూడా స్పృహ కోల్పోయినట్టు ఆ మహిళ, తన ఫిర్యాదులో చెప్పింది. మెలుకువ వచ్చిన తర్వాత.. భోజనంలో మత్తుపదార్థాలు కలిపినట్టు గ్రహించినట్టు వివరించింది. మహిళలందరు స్పృహలోకి వచ్చిన తర్వాత నిందితులతో మాట్లాడారని, చివరికి తాము మోసపోయినట్టు తెలుసుకున్నారని ఆమె స్పష్టం చేసింది.

20 women gang raped : "అంగన్​వాడీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మమ్మల్ని పిలిపించారు. కానీ మాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి, బెదిరించడం మొదలుపెట్టారు. వారితో ఫిజికల్​ రిలేషన్​ పెట్టుకోవాలని లేకపోతే ఆన్​లైన్​లో వీడియోలను లీక్​ చేస్తామని బెదిరించారు. అంతేకాదు.. మా నుంచి రూ. 5లక్షలు డిమాండ్​ చేశారు," అని ఆ మహిళ, తన ఫిర్యాదులో చెప్పింది.

20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందన్న మహిళ ఫిర్యాదుపై డీఎస్​పీ పరాస్​ చౌదరి స్పందించారు.

Rajasthan crime news latest : "ఇదే మహిళ.. గతంలో ఒక తప్పుడు కేసు పెట్టింది. కానీ రాజస్థాన్​ హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలతో.. 8మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాము," అని పరాస్​ చౌదరి అన్నారు.

ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితులను త్వరలోనే విచారిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా.. నిందితులను పోలీసులు ఇంకా అరెస్ట్​ చేయలేదని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం