Anakapalle Crime : అనకాపల్లి జిల్లాలో దారుణం, భర్తపై అనుమానంతో మహిళకు నిప్పుపెట్టిన భార్య-anakapalle crime news in telugu wife pours petrol get fire woman on husband extra marital relation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anakapalle Crime : అనకాపల్లి జిల్లాలో దారుణం, భర్తపై అనుమానంతో మహిళకు నిప్పుపెట్టిన భార్య

Anakapalle Crime : అనకాపల్లి జిల్లాలో దారుణం, భర్తపై అనుమానంతో మహిళకు నిప్పుపెట్టిన భార్య

Bandaru Satyaprasad HT Telugu
Feb 11, 2024 03:02 PM IST

Anakapalle Crime : అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంలో భార్య ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది.

 భర్తపై అనుమానంతో మహిళకు నిప్పుపెట్టిన భార్య
భర్తపై అనుమానంతో మహిళకు నిప్పుపెట్టిన భార్య

Anakapalle Crime : చిన్న అనుమానం కుటుంబాలను కూల్చివేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇటీవల వివాహేతర సంబంధాలు భార్యాభర్తల మధ్య అనుమానాలు కారణమవుతున్నాయి. భర్త లేదా భార్య ప్రవర్తనలో మార్పుతో ఆ కుటుంబంలో కలహాలు మొదలవుతున్నాయి. చివరికి దారుణ సంఘటనలకు దారితీస్తు్న్నాయి. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో వివాహేతర సంబంధం అనుమానంలో ఓ మహిళ దారుణానికి పాల్పడింది.

అసలేం జరిగింది?

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఓ మహిళ... మరో మహిళపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. తన భర్త ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య.. ఆ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాశీపురం గ్రామంలో పోతురాజు, అతని భార్య చిన్నమ్మ నివసిస్తున్నారు. తన భర్త పోతురాజుతో...అదే గ్రామానికి చెందిన అల్లంగి లక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుందని పోతురాజు భార్య చిన్నమ్మ అనుమానపడేంది. ఈ విషయమై వీరి మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే శుక్రవారం రాత్రి పోతురాజు భార్య చిన్నమ్మ...లక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను బంధువులు మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు చిన్నమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యపై అనుమానంతో నోట్లో కరెంట్ వైర్లు పెట్టి హత్య

మరో ఘటనలో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. నిద్రపోతున్న భార్య నోట్లో విద్యుత్ వైర్లు పెట్టి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హరిద్వార్‌ జిల్లాకు చెందిన హమీద్ (60) తన ఫ్యామిలీతో మంగ్‌లౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. హమీద్ కు భార్య ఖాతూన్ (52), కుమారుడు మహ్మద్ నదీం, కుమార్తె ఉన్నారు. అయితే తన భార్య ఖాతూమ్ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని హమీద్ అనుమానించేవాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఆమెను హత్యను చేయాలని హమీద్ ప్లాన్ వేసుకున్నాడు. పథకం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంట్లో నిద్రపోతున్న భార్య ఖాతూన్ నోట్లో కరెంట్ వైర్లు పెట్టి షాక్‌ ఇచ్చాడు. దీంతో ఆమె మృతి చెందింది. తండ్రి చర్యను పసిగట్టిన కుమారుడు తన తల్లి మృతికి తండ్రే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హమీద్ పై కేసు నమోదు చేశారు. హత్య అనంతరం పరారైన హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

భార్యాభర్తల మధ్య అనుమానాలతో కుటుంబాలు చీలిపోవడంతో దారుణాలకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి. మారుతున్న జీవనశైలితో సహజీవనాలు, వివాహేత సంబంధాలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం