Cell Phone Explode : చేతిలో పేలిన సెల్ ఫోన్, బాలికకు తీవ్రగాయాలు-palnadu crime news cell phone explodes in child hand severely injured ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cell Phone Explode : చేతిలో పేలిన సెల్ ఫోన్, బాలికకు తీవ్రగాయాలు

Cell Phone Explode : చేతిలో పేలిన సెల్ ఫోన్, బాలికకు తీవ్రగాయాలు

Updated Apr 21, 2024 09:20 AM IST Bandaru Satyaprasad
Updated Apr 21, 2024 09:20 AM IST

  • Cell Phone Explode : పల్నాడు జిల్లాలో సెల్‌ఫోన్‌ పేలి 11 ఏళ్ల చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఛార్జింగ్‌ పెట్టి వీడియోలు చూస్తుండగా సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్రగాయాలు అయ్యాయి.

అన్నం తినడంలేదనో, తరచూ ఏడుస్తున్నారనో...చిన్న పిల్లలకు తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇస్తున్నారు. అలా అలవాటైన సెల్ ఫోన్ పిల్లలపై విపరీత ప్రభావాలు చూపుతోంది. ఈ విషయాన్ని వైద్యులే స్పష్టం చేస్తున్నారు. విపరీతంగా సెల్ ఫోన్ వినియోగించడంతో కొన్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. 

(1 / 6)

(Unspalsh Representative image)

పల్నాడు జిల్లాలో సెల్‌ఫోన్‌ పేలి 11 ఏళ్ల చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి 5వ తరగతి చదువుతోంది. శనివారం ఛార్జింగ్‌ పెట్టి వీడియోలు చూస్తుండగా సెల్ ఫోన్ పేలిపోయింది. 

(2 / 6)

ఈ ప్రమాదంలో బాలిక వీరలక్ష్మి కుడి చేతికి తీవ్రగాయమైంది. రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్టపై కూడా గాయాలయ్యాయి. బాలికను గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు. వేసవిలో సెల్ ఫోన్ అతిగా వినియోగిస్తే వేడికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. 

(3 / 6)

అతిగా సెల్ ఫోన్ వాడుతున్నాడని ఇంటర్ సెకండియర్ విద్యార్థిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

(4 / 6)

కిషన్ బాగ్ కు చెందిన అషితోష్ జాదవ్ (22) స్థానిక కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అతడు గత కొన్ని రోజులుగా సెల్ ఫోన్ విపరీతంగా వినియోగిస్తుండడంతో కుటుంబ సభ్యులు అతడ్ని మందలించారు.

(5 / 6)

కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురైన అషితోష్...గురువారం అర్ధరాత్రి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా అషితోష్  ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం అందించగా...కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు