Crime news : ఆన్లైన్ గేమ్ విషయంలో గొడవ.. స్నేహితుడిని చంపి, మృతదేహాన్ని తగలబెట్టి..!
Friends kill boy over online game : ఆన్లైన్ గేమింగ్ వ్యవహారం మరో యువకుడి ప్రాణాలు తీసింది. పాస్వర్డ్ షేర్ చేయడం లేదన్న కోపంతో.. 18ఏళ్ల యువకుడిని.. అతని 'క్లోజ్' ఫ్రెండ్స్ చంపేశారు. పశ్చిమ్ బెంగాల్లో జరిగింది ఈ ఘటన.
Friends kill boy over online game : పశ్చిమ్ బెంగాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్లైమ్ మొబైల్ గేమ్ పాస్‌వర్డ్‌ని షేర్ చేయడం లేదన్న కోపంతో.. నలుగురు యువకులు.. తమ 'క్లోజ్' ఫ్రెండ్‌ని దారుణంగా చంపేశారు. అనంతరం అతడి మృతదేహానికి నిప్పంటించారు.
ఇదీ జరిగింది..
పశ్చిమ్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో కొన్ని రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. ఫరక్క అనే ప్రాంతంలో ఐదుగురు స్నేహితులు జీవిస్తున్నారు. వారు 10వ తరగతి చదువుకుంటున్నారు. కాగా.. వారందరు.. ఆన్లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయ్యారు. చదువుకోకుండా చాలా సమయాన్ని, గేమింగ్ కోసం కేటాయించేవారు.
ఈ నేపథ్యంలో.. జనవరి 8న ఐదుగురు స్నేహితులు కలిసి.. ఫరక్కలోని నిషింద్ర ఘాట్‌కు వెళ్లారు. అక్కడ ఆన్లైన్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. కాగా.. 18ఏళ్ల పపాయి దాస్ అనే యువకుడు.. గేమ్ పాస్వర్డ్ షేర్ చేయడానికి ఇష్టపడలేదు. నలుగురు ఎంత అడిగినా, అతను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఐదుగురి మధ్య గొడవ మొదలైంది. అందరు కోపంగా మాట్లాడుకున్నారు. కొన్ని క్షణాల్లోనే.. నలుగురు కలిసి, పపాయి దాస్‌ని దారుణంగా పొడిచి చంపేశారు. ఈ విషయం బయటకు రాకూడదని నిందితులు ఓ ప్లాన్ వేశారు. తమ బైక్స్‌లోని పెట్రోల్ తీసి, మృతదేహానికి నిప్పంటించారు. సగం కాలిన మృతదేహాన్ని.. నిషింద్ర ఘాట్ వద్ద పడేసి ఇళ్లకు పారిపోయారు.
Bengal crime news : జనవరి 8న రాత్రంత ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన పపాయి దాస్ కుటుంబసభ్యులు.. మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. పపాయి దాస్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, పపాయి దాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే.. నిషింద్ర ఘాట్ వద్ద.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు. ఆ విషయాన్ని పపాయి దాస్ కుటుంబసభ్యులకు వెల్లడించారు. మృతదేహంపై ఉన్న టాటూల ఆధారంగా.. పపాయి దాస్ మృతదేహాన్ని గుర్తించారు అతని కుటుంబసభ్యులు.
మరోవైపు.. పపాయి దాస్ మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు.. పోలీసులు, తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో.. పపాయి దాస్‌తో క్లోజ్‌గా ఉండే నలుగురు స్నేహితుల గురించి తెలుసుకున్నారు. వారి ఫోన్ సిగ్నల్ సాయంతో.. పపాయి దాస్ మరణించిన రోజు, ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు. వారు కూడా నిషింద్ర ఘాట్ వద్దే ఉన్నారని తెలుసుకున్న పోలీసులు.. యువకులను విచారణ కోసం పిలిపించారు. ఈ నేపథ్యంలో.. పపాయి దాస్‌ను తామే చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించారు నిందితులు.
Friends kill boy in Bengal : "ఆన్లైన్ మొబైల్ గేమ్ పాస్వర్డ్ నేపథ్యంలో గొడవ మొదలైందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గొడవ పెద్దదిగా మారింది. చివరికి.. నలుగురు కలిసి, ఒకరిని చంపేశారు," అని పోలీసులు వెల్లడించారు.
ఘటనపై మర్డర్ కేసు నమోదు చేసుకున్నట్టు, నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా.. మృతుడు పపాయి దాస్‌కు గేమ్స్ వ్యవసంగా ఎక్కువగా ఉండేదని, ఆ అడిక్షన్తోనే ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదని, అతని తల్లి చెప్పినట్టు, పోలీసులు వివరించారు.
సంబంధిత కథనం