Step father rapes girl : బాలిక, బాలుడుపై సవతి తండ్రి అత్యాచారం.. సాయం చేసిన బిడ్డల తల్లి!
Step father rapes girl : బాలిక, బాలుడుపై సవతి తండ్రి అత్యాచారం చేసిన ఘటన ఘజియాబాద్‌లో కలకలం రేపింది. ఈ నేరంలో.. బిడ్డల తల్లి సాయం చేయడం గమనార్హం!
Ghaziabad crime news : ఘజియాబాద్‌లో అత్యంత దారుణ, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 11ఏళ్ల బాలిక, 13ఏళ్లు బాలుడుపై.. వారి సవతి తండ్రి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు.. ఆ పిల్లల తల్లి సాయం చేయడం గమనార్హం!
ఇదీ జరిగింది..
సంబంధిత పిల్లల తండ్రి.. కొవిడ్ మహమ్మారి సమయంలో మరణించాడు. వారికి ఆరేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. కాగా.. భర్త మరణం తర్వాత.. పిల్లలను ఘజియాబాద్‌లో వదిలేసిన తల్లి.. ఫిరోజాబాద్‌లోని అత్తారింట్లో నివాసముంది.
దాదాపు ఏడాది క్రితం.. ఆ మహిళ మళ్లీ ఘజియాబాద్‌కు వచ్చింది. ఆమె.. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. అతను స్థానిక వ్యక్తి అని సమాచారం. కాగా.. అతనికి అప్పటికే పెళ్లి జరిగి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మహిళతో పరిచయం అవ్వడం, ఆమెను కూడా ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత.. తాను ఉంటున్న ఇంటి దగ్గర ఒక రూమ్‌ని రెంట్ తీసుకున్న ఆ వ్యక్తి.. కొత్త భార్యను, ఆమె పిల్లలను అందులో ఉండమని చెప్పాడు.
Woman Tortures daughter and son : అప్పటి నుంచి బాలిక, బాలుడుకు నరకం మొదలైంది! ఆ వ్యక్తి.. ఆ పిల్లలను ఏడాదిగా రేప్ చేస్తూ వచ్చాడట. ఈ విషయం తల్లికి చెప్పి బాధపడిన పిల్లలకు మరో షాక్ తగిలింది. 'ఈ విషయం ఎవరికి చెప్పకండి, చెబితే ఊరుకోను,' అని బెదిరించేదట ఆ తల్లి. అంతేకాదు.. వారిని చాలాసార్లు కొట్టిందట.
ఇక తనపై అత్యాచారాన్ని భరించలేకపోయిన 13ఏళ్ల బాలుడు.. గత నవంబర్‌లో ఇంట్లో నుంచి పారిపోయాడు. స్థానిక టీ కొట్టు దగ్గర ఆశ్రయం తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ బాలికపై అత్యాచారం కొనసాగుతూ వచ్చింది. బాలిక కూడా.. ఇక సహించలేక, ఈ ఏడాది జనవరిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమెను దిల్లీ పోలీసులు రక్షించారు.
"బాలిక చాలా మనోవేదనకు గురైంది. పెద్దగా సమాచారం ఇవ్వలేదు. లోనీ బార్డర్ దగ్గర ఉంటామని మాత్రమే చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాము," అని దిల్లీ పోలీసులు చెప్పారు. ఆ తర్వాత.. కేసును ఘజియాబాద్ పోలీసులకు బదిలీ చేసినట్టు వివరించారు.
Man rapes step daughter : బాలిక విషయంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇన్ఫార్మర్లకు విషయం చెప్పి.. బాలిక ఎక్కడ ఉండేదో కనుక్కోమని చెప్పారు.
"మా టీమ్.. చివరికి బాలిక తల్లిని ట్రేస్ చేసింది. విచారణలో భాగంగా ఆ మహిళ చాలా విషయాలు చెప్పుకొచ్చింది. 'నా భర్త నన్ను వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించాడు. అతను డబ్బులు సంపాదించేందుకు ఇలా చేశాడు,' అని చెప్పింది. ఆమె స్టైట్మెంట్తో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశాము. విచారణలో అతను నిజం ఎప్పుకున్నాడు. బాలిక, బాలుడును మాటిమాటికి రేప్ చేసినట్టు అంగీకరించాడు," అని ఓ పోలీసు అధికారి చెప్పారు.
Crime news latest : విచారణలో భాగంగా.. బాలుడు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పింది ఆ మహిళ. అతడిని నుంచి స్టేట్మెంట్ తీసుకుని.. నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.
"పిల్లల శరీరాలపై గాయాలు ఉన్నాయి. వారి తల్లి ఇంట్లోనే వారిపై లైంగిక దాడి జరిగింది. నిందితుడి మొదటి భార్యకు.. రెండో పెళ్లి గురించి తెలియదను అనుకుంటున్నాము," అని పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 376, 377, 323 కింద కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం