తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Dinner: బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

Jr NTR Dinner: బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

Hari Prasad S HT Telugu

29 April 2024, 9:01 IST

    • Jr NTR Dinner: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబైలో హల్‌చల్ చేస్తున్నాడు. వార్ 2 మూవీ కోసం అక్కడికి వెళ్లిన అతడు.. బాలీవుడ్ స్టార్లతో కలిసి డిన్నర్ కు వెళ్లిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..
బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి.. (HT Photo/Varinder Chawla)

బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

Jr NTR Dinner: వార్ 2 మూవీతో జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న విషయం తెలుసు కదా. ఈ మూవీ షూటింగ్ కోసమే కొన్నాళ్ల కిందట ముంబై వెళ్లిన తారక్.. అక్కడి స్టార్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. బాలీవుడ్ తారలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి అక్కడి స్టార్లతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్లాడు.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. నరసింహకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్.. దీపతో మొండిగా వాదించిన శౌర్య

Brahmamudi May 16th Episode: అత్తింట్లో అనామిక పంచాయితీ - క‌ళ్యాణ్ కోసం ఒక్క‌టైన దుగ్గిరాల కుటుంబం - రాజ్‌కు షాక్‌

జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్

ముంబైలో నైటౌట్లు, పార్టీలు కామనే. అయితే హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా వరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ముంబై వెళ్లిన తర్వాత వాటికి అలవాటు పడ్డట్లున్నాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి బాలీవుడ్ స్టార్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, కరణ్ జోహార్ లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మి ప్రణతి డిన్నర్ కు వెళ్లారు.

ఈ అరుదైన ఫొటోల కోసం అక్కడి ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ డిన్నర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, ఆలియా, రణ్‌బీర్, కరణ్ జోహార్ కలిసి వచ్చారు. ఆ తర్వాత హృతిక్ రోషన్, సబా ఆజాద్ వాళ్లతో చేరారు. వార్ 2 మూవీలో హృతిక్ తో కలిసే తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

దీంతో అటు బ్రహ్మాస్త్ర, ఇటు వార్ 2 మూవీ టీమ్స్ కలయికగా ఈ డిన్నర్ సాగింది. ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ ముంబైలోనే కొనసాగుతోంది. ఈ షూటింగ్ కోసమే కొన్నాళ్ల కిందట తారక్ అక్కడికి వెళ్లాడు. ఇప్పుడీ టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల కలయికకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

జూనియర్ ఎన్టీఆర్ సీరియస్

ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దీంతో వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ కు విలన్ గా అతన్ని మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. తారక్ ముంబైలో అడుగుపెట్టినప్పటి నుంచే అక్కడ అతనికి ఉన్న రేంజ్ ఏంటో తెలిసిపోయింది. తొలి రోజు నుంచే మీడియా ఎన్టీఆర్ వెంట పడింది. అతడు ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫాలో అవుతున్నారు.

అలా ఈ మధ్యే ఓ ఫొటోగ్రాఫర్ తారక్ వెంటే వెళ్లాడు. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న ఎన్టీఆర్.. అతన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓయ్.. వెనక్కి వెళ్లు అంటూ అతనిపై గట్టిగా అరిచాడు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. ప్రస్తుతం తారక్ ఈ వార్ 2 మూవీతోపాటు మరో పాన్ ఇండియా సినిమా దేవరతోనూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

దేవర అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా.. వార్ 2తో తారక్ బాలీవుడ్ లోకి వెళ్తున్నాడు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో అయినా క్రమంగా సౌత్, నార్త్ లు కలిసిపోతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం