Jr NTR furious: ఓయ్.. వెనక్కి వెళ్లు.. ఫొటోగ్రాఫర్లపై మండిపడిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్-telugu cinema news jr ntr furious over paparazzi who come close to him shouts keep it back ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Furious: ఓయ్.. వెనక్కి వెళ్లు.. ఫొటోగ్రాఫర్లపై మండిపడిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Jr NTR furious: ఓయ్.. వెనక్కి వెళ్లు.. ఫొటోగ్రాఫర్లపై మండిపడిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Apr 26, 2024 03:29 PM IST

Jr NTR furious: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహనం కోల్పోయాడు. తన వెనకే వస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ మండిపడ్డాడు. వెనక్కి వెళ్లు అంటూ తీవ్ర స్వరంతో అతడు చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

ఓయ్.. వెనక్కి వెళ్లు.. ఫొటోగ్రాఫర్లపై మండిపడిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్
ఓయ్.. వెనక్కి వెళ్లు.. ఫొటోగ్రాఫర్లపై మండిపడిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Jr NTR furious: జూనియర్ ఎన్టీఆర్ కు ముంబైలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటోంది. వార్ 2 మూవీ కోసం అతడు ఎప్పుడైతే అక్కడికి వెళ్లాడో అప్పటి నుంచీ తారక్ వెంట మీడియా పడుతూనే ఉంది. తాజాగా అలాగే తన వెంటే వీడియో తీస్తూ వస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ పై అతడు తీవ్రంగా మండిపడ్డాడు. సహనం కోల్పోయిన ఎన్టీఆర్.. సదరు ఫొటోగ్రాఫర్ పై అరవడం వీడియోలో చూడొచ్చు.

తారక్ సీరియస్

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీయే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ముంబైలో అడుగుపెట్టినప్పటి నుంచీ తారక్ కు ఈ ఫొటోలు, వీడియోల తాకిడి మొదలైంది. అతడు ఎక్కడికి వెళ్లినా వెంటపడుతున్నారు.

తాజాగా ఇలాగే ఓ ఫొటోగ్రాఫర్ వీడియో తీస్తూ తారక్ వెంటే వెళ్లాడు. అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా అతడు వినలేదు. మరీ దగ్గర వెళ్లడంతో తారక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో మొబైల్లో మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్.. మాట్లాడటం ఆపి ఓయ్.. వెనక్కి వెళ్లు అంటూ గట్టిగా అరవడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియోను టోటల్ ఫిల్మీ అనే వెబ్‌సైట్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసింది. హోటల్లోకి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటికే ఫోన్లో ఎవరితోనూ తారక్ సీరియస్ గా మాట్లాడుతూ వెళ్తున్నాడు. బహుషా అతనికి ఆగ్రహానికి అది కూడా ఒక కారణం కావచ్చు. హైదరాబాద్ కంటే ముంబైలో అతనికి ఈ ఫొటోగ్రాఫర్ల తాకిడి ఎక్కువగా ఉంది.

తరచూ ఇలాంటివి జరుగుతుండటంతో ఎన్టీఆర్ సహనం కోల్పోతున్నాడు. గతంలో ఒకసారి ఇలాగే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తన కోసం ఎదురు చూస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ తో.. నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉంటావా.. అన్ని పనులూ ఇక్కడే చేస్తావా అంటూ తారక్ అడగడం గమనార్హం. చాలా వరకు కెమెరా కంటికి దూరంగా ఉండటానికి తారక్ ఇష్టపడతాడు.

వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్

వార్ 2 మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో అతనికి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ కు విలన్ పాత్రలో ఇప్పుడు తారక్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో సాగుతోంది. ఈ మధ్యే సెట్స్ లో ఉన్న హృతిక్, తారక్ ఫొటోలు లీకయ్యాయి.

ఇక తెలుగులోనూ దేవర మూవీతో అతడు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. దసరా పండగ సందర్భంగా రిలీజ్ కానుంది.

IPL_Entry_Point