NTR in War 2: వార్-2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇదే! మరో హిందీ మూవీ కూడా..-ntr as raw agent in hrithik roshan war 2 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr In War 2: వార్-2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇదే! మరో హిందీ మూవీ కూడా..

NTR in War 2: వార్-2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇదే! మరో హిందీ మూవీ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 05, 2024 04:02 PM IST

Jr NTR War 2 Movie: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేయనున్న వార్-2 చిత్రంపై విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో షురూ కానుంది. అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏ పాత్ర చేయనున్నారో తాజాగా సమాచారం వెల్లడైంది.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. ఏప్రిల్‍లోనే రిలీజ్ కావాల్సిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ 10కి వాయిదా పడింది. అయితే, ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. బాలీవుడ్‍లో స్టార్ హీరో హృతిక్ రోషన్‍తో కలిసి వార్-2 సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంపై ఆసక్తి విపరీతంగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా మారిన ఎన్టీఆర్ బాలీవుడ్‍లో అడుగుపెడుతుండటంతో హైప్ చాలా ఉంది. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వార్-2 రూపొందనుంది.

రా ఏజెంట్‍గా..

వార్-2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏ క్యారెక్టర్ చేయనున్నారో సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో భారత ఏజెంట్‍ పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నారని పింక్‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. యశ్‍రాజ్ ఫిల్మ్ (YRF) యూనివర్స్‌లో ఇప్పటికే సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారూఖ్ ఖాన్ ఇండియన్ ఏజెంట్లుగా చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కొత్త ‘రా (RAW)’ ఏజెంట్‍గా ఎంటర్ అయ్యారు.

2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు వార్-2 రూపొందనుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ క్యారెక్టర్లలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్టు పేర్కొంది.

మరో హిందీ మూవీ కూడా..

వార్-2 సినిమా తర్వాత ఈ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లోనే ఎన్టీఆర్ ఓ పూర్తిస్థాయి హిందీ మూవీ కూడా చేయనున్నారని టాక్ బయటికి వచ్చింది. ఇండియన్ రా ఏజెంట్‍గా ఆ చిత్రంలో హీరోగా ఆయన ఉంటారని రూమర్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఈ యూనివర్స్‌లో వచ్చే చిత్రాల్లో క్యామియో రోల్స్ కూడా చేయనున్నారు.

షూటింగ్ అప్పటి నుంచే..

వార్-2 సినిమా షూటింగ్ మార్చి 7వ తేదీన మొదలుకానుందని సమాచారం బయటికి వచ్చింది. జపాన్‍‍ దేశం టోక్యోలోని చారిత్రక షావోలిన్ టెంపుల్ వద్ద షూటింగ్ షూరూ అవనుందట. ప్రస్తుతం దేవర చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. వార్-2 షూటింగ్‍లో ఏప్రిల్‍లో పాల్గొనేలా ప్లాన్ చేశారు.

వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఆరో చిత్రంగా వార్-2 ఉంది. ఈ సినిమాను 2025 ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

దేవర గురించి..

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ వీఎఫ్‍ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‍లోనే ముగియనుందని తెలుస్తోంది. అయితే, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టనుంది. అందుకే దేవర రిలీజ్‍ను ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10వ తేదీకి మూవీ టీమ్ వాయిదా వేసింది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీరోల్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point