Janhvi Kapoor Remuneration: రెమ్యూనేషన్‍ను భారీగా పెంచేసిన జాన్వీ కపూర్.. దేవర, రామ్‍చరణ్ సినిమాలకు ఎంతంటే?-janhvi kapoor hikes her remuneration demands this much amount for devara ram charan rc16 movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor Remuneration: రెమ్యూనేషన్‍ను భారీగా పెంచేసిన జాన్వీ కపూర్.. దేవర, రామ్‍చరణ్ సినిమాలకు ఎంతంటే?

Janhvi Kapoor Remuneration: రెమ్యూనేషన్‍ను భారీగా పెంచేసిన జాన్వీ కపూర్.. దేవర, రామ్‍చరణ్ సినిమాలకు ఎంతంటే?

Janhvi Kapoor Remuneration: యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ రెమ్యూనరేషన్‍కు భారీగా పెంచేశారని టాక్ వస్తోంది. రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న మూవీ కోసం ఆమె భారీ మొత్తం డిమాండ్ చేశారట. దేవరతో కన్నా ఎక్కువ అడిగారని తెలుస్తోంది. ఆ వివరాలివే..

Janhvi Kapoor Remuneration: రెమ్యూనేషన్‍ను భారీగా పెంచేసిన జాన్వీ కపూర్ (Instagram/@janhvikapoor)

Janhvi Kapoor Remuneration: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. టాలీవుడ్‍లోనూ హవా చూపించేందుకు రెడీ అవుతున్నారు. అలనాటి స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ.. దక్షిణాదికి వచ్చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో ఆమె హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో అడుగుపెడుతున్నారు. అలాగే, మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించనున్న స్పోర్ట్స్ బ్యాక్‍డ్రాప్ మూవీ (RC16)లోనూ జాన్వీ హీరోయిన్‍గా చేయనున్నారని సమాచారం బయటికి వచ్చింది.

దేవర, ఆర్‌సీ16లకు జాన్వీ రెమ్యూనేరషన్!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా దేవర చిత్రం రూపొందుతోంది. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవర పార్ట్-1 చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. కాగా, దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ రూ.5కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ వెల్లడించింది.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‍చరణ్ చేయనున్న మూవీ (RC16) కోసం జాన్వీ కపూర్ తన ఫీజ్‍ను డబుల్ చేశారని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఈ చిత్రం కోసం రూ.10కోట్ల రెమ్యూనరేషన్‍ను జాన్వీ డిమాండ్ చేశారట. జాన్వీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేశారని ఆ రిపోర్ట్ వెల్లడించింది. అయితే, అధికారంగా మూవీ టీమ్ ఈ లెక్కలను వెల్లడించలేదని కూడా పేర్కొంది. కాగా, RC16 చిత్రంలో జాన్వీ హీరోయిన్ అంటూ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

బాలీవుడ్‍లో ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.4కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు జాన్వీ కపూర్. అయితే, రామ్‍చరణ్ మూవీకి తన ఫీజును అదనంగా రూ.6కోట్లు పెంచి అడిగారని ఆ రిపోర్టు వెల్లడించింది.

మహాభారతం ఆధారంగా తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్ర పోషించనున్న కర్ణ చిత్రంలోనూ జాన్వీ కపూర్ నటిస్తారని రూమర్లు వస్తున్నాయి. ఈ మూవీలో ఆమె ద్రౌపది పాత్ర చేస్తారని టాక్ ఉంది.

దేవర చిత్రం గురించి..

దేవర చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా.. వీఎఫ్‍ఎక్స్ పనుల ఆలస్యం వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‍ను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ హీరోయిన్‍గా చేస్తున్నారు. పక్కా పల్లెటూరి అమ్మాయిగా లంగావోణీలో ఈ చిత్రంలో జాన్వీ కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన జాన్వీ లుక్ ఆకట్టుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారెజ్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబో దేవరతో రిపీట్ అవుతోంది.

ఆర్‌సీ 16..

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‍చరణ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం చేయనున్నారు. చెర్రీకి ఇది 16వ చిత్రం కావడంతో దీన్ని వర్కింగ్ టైటిల్‍ ఆర్‌సీ16గా పిలుస్తున్నారు. ఉత్తరాంధ్ర దిగ్గజ మల్లయోధుడు, రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‍గా ఈ చిత్రం తెరకెక్కుతుందని రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.