Devara vs Thandel: బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాగచైతన్య పోటీ?: వివరాలివే-tollywood news devara and thandel movies may compete during dussehra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tollywood News Devara And Thandel Movies May Compete During Dussehra

Devara vs Thandel: బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాగచైతన్య పోటీ?: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 17, 2024 08:06 PM IST

Devara vs Thandel Movies: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరకు తండేల్ మూవీ పోటీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లోనే వస్తున్న ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడే ఛాన్స్‌ ఉంది. ఆ వివరాలివే..

Devara vs Thandel: బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాగచైతన్య పోటీ?
Devara vs Thandel: బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాగచైతన్య పోటీ?

Devara vs Thandel: మ్యాన్ ఆఫ్ ది మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంపై క్రేజ్ భారీ రేంజ్‍లో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్‍లో రిలీజ్ కావాల్సిన దేవర పార్ట్-1 వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది.

నాగచైతన్య హీరోగా తండేల్ మూవీ రూపొందుతోంది. మత్య్సకారుడి పాత్రలో చైతూ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాకిస్థాన్ జైలులో చిత్ర హింసలు ఎదుర్కొని.. 13 నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తండేల్ మూవీలో దేశభక్తితో పాటు లవ్ స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుంది.

దేవరతో తండేల్ ఫైట్!

కాగా, తండేల్ చిత్రాన్ని దసరా పండుగ సమయంలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు చందూ మొండేటి తాజాగా వెల్లడించారు. దసరాకు ఈ మూవీని థియేటర్లలోకి తీసుస్తామని చెప్పారు. దీంతో దేవరతో బాక్సాఫీస్ వద్ద తండేల్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఒకే వారంలో ఈ చిత్రాలు వస్తాయా.. లేకపోతే వారం గ్యాప్‍తో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తారా అనేది చూడాలి.

ఒకవేళ దసరా సీజన్‍లోనే రెండు సినిమాలు రావాలనుకుంటే.. ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. కనీసం రెండు రోజుల గ్యాప్ అయినా ఉండొచ్చు.

మరోవైపు, దేవర పార్ట్-1 చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తామని మూవీ ప్రకటించింది. అయితే, పుష్ప 2: ది రూల్ చిత్రం ఆగస్టు 15వ తేదీ నుంచి వాయిదా పడితే.. అప్పుడు దేవర రావొచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అలా జరిగితే.. దేవర, తండేల్ పోటీ తప్పే ఛాన్స్ ఉంటుంది. రిలీజ్ డేట్లు అనూహ్యంగా మారిపోతున్న ట్రెండ్‍లో చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

దేవర గురించి..

దేవర సినిమా గ్రాండ్ స్కేల్‍లో భారీ వీఎఫ్‍ఎక్స్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‍లో కనిపిస్తారని తెలుస్తోంది. సముద్ర తీరంలో తమ ప్రాంతాన్ని, ప్రజలను రక్షించే యోధుడిగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని సమాచారం. గత నెల వచ్చిన దేవర గ్లింప్స్.. ఈ మూవీపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. సముద్రం ఎరుపెక్కేలా ఉన్న ఆ యాక్షన్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావటంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

మత్య్యకారుడు రాజు పాత్రను తండేల్ చిత్రంలో చేస్తున్నారు నాగ చైతన్య. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం