Koratala Siva: సత్యదేవ్ మూవీ ప్రమోషన్‍కు దర్శకుడు కొరటాల శివ.. దేవర విషయంలో ఆ రూమర్‌పై స్పందిస్తారా?-koratala siva set to attend krishnamma press meet fans waiting for jr ntr devara movie update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koratala Siva: సత్యదేవ్ మూవీ ప్రమోషన్‍కు దర్శకుడు కొరటాల శివ.. దేవర విషయంలో ఆ రూమర్‌పై స్పందిస్తారా?

Koratala Siva: సత్యదేవ్ మూవీ ప్రమోషన్‍కు దర్శకుడు కొరటాల శివ.. దేవర విషయంలో ఆ రూమర్‌పై స్పందిస్తారా?

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2024 06:34 PM IST

Koratala Siva - Devara Movie: కృష్ణమ్మ సినిమా ప్రమోషన్‍ కోసం నిర్వహిస్తున్న ప్రెస్‍మీట్‍కు దర్శకుడు కొరటాల శివ హాజరుకానున్నారు. అయితే, ఈ మీట్‍లో దేవర సినిమా గురించి ఆయన ఏదైనా అప్‍డేట్ చెబుతారనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఆ వివరాలివే..

Koratala Siva: సత్యదేవ్ మూవీ ప్రమోషన్‍కు దర్శకుడు కొరటాల శివ.. దేవర విషయంలో ఆ రూమర్‌పై స్పందిస్తారా?
Koratala Siva: సత్యదేవ్ మూవీ ప్రమోషన్‍కు దర్శకుడు కొరటాల శివ.. దేవర విషయంలో ఆ రూమర్‌పై స్పందిస్తారా?

Koratala Siva: యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న కృష్ణమ్మ చిత్రంపై మంచి హైప్ ఉంది. విజయవాడ బ్యాక్‍డ్రాప్‍లో రస్టిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ వస్తోంది. వీవీ గోపాలకృష్ణ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లను మూవీ టీమ్ వేగవంతం చేస్తోంది. కృష్ణమ్మ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో ఆయన పాల్గొనేందుకు రెడీ అయ్యారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రేపు (ఏప్రిల్ 26) హైదరాబాద్‍లో నిర్వహించే ప్రెస్‍మీట్‍కు కొరటాల శివ హాజరుకానున్నారు. దీంతో ఆయన దేవర మూవీపై అప్‍డేట్ ఇస్తారనే అంచనాలు ఉన్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్‍తో గ్రాండ్ స్కేల్‍లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర గురించి సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‍లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏకంగా అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది. అయితే, ఇప్పుడు కృష్ణమ్మ ప్రెస్‍మీట్‍కు కొరటాల శివ హాజరువుతుండటంతో దేవర గురించి చెబుతారని సినీ జనాలు నిరీక్షిస్తున్నారు.

ఆ రూమర్లపై క్లారిటీ ఇస్తారా..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20వ తేదీన దేవర నుంచి తొలి పాట రిలీజ్ కానుందని కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రెడీ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, కృష్ణమ్మ ఈవెంట్‍లో రేపు (ఏప్రిల్ 26) పాల్గొననున్న దర్శకుడు కొరటాల శివ ఆ రూమర్లపై స్పందిస్తారేమో చూడాలి. లేకపోతే ఏదైనా కొత్త అప్‍డేట్ చెబుతారా అనే ఆసక్తి కూడా ఉంది.

దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‍ పాత్ర పోషిస్తున్నారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో విడుదల కానుంది.

కృష్ణమ్మ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్

కృష్ణమ్మ సినిమా ట్రైలర్ రిలీజ్‍కు కూడా టైమ్ ఫిక్స్ అయింది. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రేపు (ఏప్రిల్ 26) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ట్రైలర్ కూడా అంచనాల మేర ఉంటే ఈ చిత్రానికి మరింత బజ్ వస్తుంది. మే 3న కృష్ణమ్మ మూవీ రిలీజ్ కానుంది.

కృష్ణమ్మ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించగా.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సత్యదేవ్‍ సరసన హీరోయిన్‍గా అథిరా రాజ్ నటించారు. లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నందగోపాల్ ఈ మూవీలో కీరోల్స్ చేశారు.

IPL_Entry_Point