Netflix CEO Meets Jr NTR: ఎన్టీఆర్‌ను కలిసిన నెట్‍ఫ్లిక్స్ సీఈవో.. సింపుల్, స్టైలిష్ లుక్‍లో యంగ్ టైగర్: ఫొటోలు
- Netflix CEO Meets Jr NTR: ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారన్‍డ్రోస్.. టాలీవుడ్ యంగ్ టైగర్, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. ఎన్టీఆర్ ఆయనకు ఆతిథ్యమిచ్చారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివరాలివే..

(1 / 5)
భారత పర్యటనకు వచ్చిన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సీఈవో టెడ్ సారన్‍డ్రోస్.. గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‍లోని తన నివాసంలో నేడు (డిసెంబర్ 8) టెడ్‍కు లంచ్‍కు ఆతిథ్యమిచ్చారు ఎన్టీఆర్.
(2 / 5)
నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్‍ను కలవడం, లంచ్‍కు ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంగా అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చెబుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. సినిమాలు, ఫుడ్ పట్ల ప్రేమను పరస్పరం మాట్లాడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేశామని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
(3 / 5)
ఎన్టీఆర్‌తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, అన్న కల్యాణ్ రామ్, దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివ కూడా నెట్‍ఫ్లిక్స్ టీమ్‍ను కలిశారు. సింపుల్‍గా టీషర్ట్, జీన్స్ ధరించి స్టైలిష్ లుక్‍లో తారక్ కనిపించారు.
(4 / 5)
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍ను గురువారం కలిశారు టెడ్ సారన్‍డ్రోస్. నేడు ఎన్టీఆర్‌తో సమావేశమయ్యారు. ఏవైనా ప్రాజెక్టుల కోసం టెడ్ వీరిని కలిశారా.. లేక సాధారణంగా వచ్చారా అన్న విషయంపై క్లారిటీ రాలేదు.
ఇతర గ్యాలరీలు