Satya Dev - Krishnamma: సత్యదేవ్ కృష్ణమ్మ టైటిల్ సాంగ్ రిలీజ్-satyadev krishnamma movie title song released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satya Dev - Krishnamma: సత్యదేవ్ కృష్ణమ్మ టైటిల్ సాంగ్ రిలీజ్

Satya Dev - Krishnamma: సత్యదేవ్ కృష్ణమ్మ టైటిల్ సాంగ్ రిలీజ్

HT Telugu Desk HT Telugu

Satya Dev - Krishnamma: సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ సినిమాలోని టైటిల్ సాంగ్ ను శనివారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

సత్యదేవ్ (Twitter)

Satya Dev - Krishnamma: టాలీవుడ్ యంగ్ హీరోల్లో డిఫ‌రెంట్ క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు స‌త్య‌దేవ్‌. అత‌డు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం కృష్ణ‌మ్మ‌. ముగ్గురు స్నేహితుల కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడ కొరటాల శివ... కృష్ణమ్మ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను శనివారం రిలీజ్ చేశారు. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిదమ్మా మాలో సంతోషం అంటూ సాగిన పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు కాలభైరవ సంగీతాన్ని అందించాడు. హీరోతో పాటు అతడి స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చాటిచెబుతూ ఈ పాట సాగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ తో పాటు మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇంటెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో లక్ష్మణ్, కృష్ణ, అధీరా రాజ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణమ్మతో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో నటిస్తున్నాడు.