Jr NTR in Mumbai: ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూశారా.. ఫొటోల కోసం ఎగబడిన మీడియా-jr ntr in mumbai for war 2 with hrithik roshan yrf spy universe movie ntr debut bollywood movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr In Mumbai: ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూశారా.. ఫొటోల కోసం ఎగబడిన మీడియా

Jr NTR in Mumbai: ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూశారా.. ఫొటోల కోసం ఎగబడిన మీడియా

Hari Prasad S HT Telugu
Apr 11, 2024 07:43 PM IST

Jr NTR in Mumbai: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు. అయితే అక్కడ కూడా అతనికి మామూలు క్రేజ్ లేదు. వార్ 2 సినిమా కోసం అక్కడికి వెళ్లిన తారక్ ఫొటోల కోసం మీడియా ఎగబడింది.

ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూశారా.. ఫొటోల కోసం ఎగబడిన మీడియా
ముంబైలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చూశారా.. ఫొటోల కోసం ఎగబడిన మీడియా

Jr NTR in Mumbai: తన తొలి బాలీవుడ్ సినిమాలో నటించడం కోసం జూనియర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు. గురువారం (ఏప్రిల్ 11) అతడు నగరంలో అడుగు పెట్టగానే మీడియా అతని ఫొటోల కోసం ఎగబడింది. హృతిక్ రోషన్ తో కలిసి తారక్ వార్ 2 మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ రూపొందుతోంది.

వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో అతనికి ముంబైలోనూ ఓ రేంజ్ క్రేజ్ ఉంది. తాజాగా వార్ 2 మూవీ కోసం అక్కడికి వెళ్లిన తారక్.. అక్కడ తన కోసం వేచి చూస్తున్న ఫొటోగ్రాఫర్లను చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పటికే ఏక్ థా టైగర్, పఠాన్ లాంటి స్పై మూవీస్ తీసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్.. ఇప్పుడు వార్ 2 తీస్తోంది.

ఈ సినిమా షూటింగ్ కోసమే అతడు ముంబై వెళ్లాడు. అక్కడ యశ్ రాజ్ ఆఫీస్ లోకి వెళ్లే ముందు తారక్ ఫొటోల కోసం ఎంతో మంది ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ ఫొటోలు, వీడియోలను ఎన్టీఆర్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. "వార్ 2లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ రివీల్ చేశారు. 

అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ మూవీ కోసం అతడు ముంబైలో అడుగుపెట్టాడు. వార్ 2లో హృతిక్ రోషన్, తారక్ ముఖాముఖి తలపడనున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ కూడా నటిస్తోంది. వార్ వచ్చే ఏడాది ఆగస్ట్ 14న రిలీజ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు.

వార్ 2తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ

ఈ ఫొటోల్లో తారక్ స్టన్నింగ్ లుక్ లో కనిపించాడు. ఓ ఫార్మల్ షర్ట్, క్యాప్, సన్ గ్లాసెస్ లో ఎంతో స్టైలిష్ గా ఉన్నాడు. ముంబైలో తనకు ఘనస్వాగతం పలికిన ఫొటోగ్రాఫర్లకు అతడు థ్యాంక్స్ చెప్పాడు. వీళ్లంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారని తారక్ హిందీలో అక్కడి వాళ్లను అడగడం కూడా ఓ వీడియోలో వినిపించింది.

జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ వార్ 2 మూవీయే బాలీవుడ్ లో తొలి సినిమా. అతడు మూవీలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ కోసం పది రోజుల పాటు ముంబైలోనే ఉండనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఇంత వరకూ అతడు ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదని మూవీ వర్గాలు వెల్లడించాయి.

వార్ 2 మూవీలో ఎన్నో యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయి. ఇందులో డూపు లేకుండా వాటిని చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పట్టుదలతో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలోనూ అతడు అలాగే చేశాడు. ఇప్పుడు వార్ 2తో హిందీ బెల్ట్ లో తారక్ క్రేజ్ మరో రేంజ్ కు చేరనుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకూ మరో సినిమాలో కనిపించలేదు. కొరటాల శివతో దేవర చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5నే రిలీజ్ అవుతుందని మొదట భావించినా.. ఇప్పుడు అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు.

IPL_Entry_Point