Aadi Re-release date: 22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. రీ-రిలీజ్ డేట్ ఇదే-aadi movie to re release after 22 years on jr ntr birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aadi Re-release Date: 22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. రీ-రిలీజ్ డేట్ ఇదే

Aadi Re-release date: 22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. రీ-రిలీజ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 10, 2024 09:07 PM IST

Aadi Re-release date: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలో భారీ బ్లాక్ బస్టర్ అయిన ఆది సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. 22 ఏళ్ల తర్వాత ఈ మూవీ రీ-రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ఎప్పుడు రానుందంటే..

Aadi Re-release date: 22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. రీ-రిలీజ్ డేట్ ఇదే
Aadi Re-release date: 22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. రీ-రిలీజ్ డేట్ ఇదే

Aadi Re-release date: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ‘ఆది’ సినిమాకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రమే ఎన్టీఆర్‌ను యాక్షన్ మాస్ హీరోగా మార్చింది. హీరోగా ఎన్టీఆర్‌కు మూడో చిత్రమైన ఆది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్ తొలినాళ్లలోనే ఆయనను స్టార్ హీరో రేంజ్‍కు తీసుకెళ్లింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆది సినిమా 2002లో రిలీజైంది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా ఆది వచ్చింది. స్టూడెంట్‍గా, ఫ్యాక్షన్ లీడర్‌గా ఎన్టీఆర్ నటన విశ్వరూపం చూపారు. ఆ ‘ఆది’ సినిమా ఇప్పడు మళ్లీ థియేటర్లలోకి రానుంది. 22 ఏళ్ల తర్వాత ఆ చిత్రం రీ-రిలీజ్ కానుంది.

రీ-రిలీజ్ ఎప్పుడంటే..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆది సినిమా రీ-రిలీజ్ కానుంది. మే 19, 20 తేదీల్లో ఈ సినిమా ప్రత్యేక షోలు థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. ఈ ఏడాది మే 20వ తేదీన తన 41వ పుట్టిన రోజును ఎన్టీఆర్ జరుపుకోనున్నారు. అందుకు ఒక్కరోజు ముందే మే 19న ఆది చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.

ఆది గురించి..

ఆది సినిమా 2002 మార్చి 28వ తేదీన రిలీజైంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్‍గా నటించారు. ఆహుతి ప్రసాద్, చలపతి రావు, రాజన్ పీ దేవ్, అలీ, ఎల్బీ శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, రాజీవ్ కనకాల ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వీవీ వినాయక్ తెరకెక్కించారు. ఈ మూవీలో కాలేజ్ కామెడీతో పాటు హైవోల్టేజ్ యాక్షన్ కూడా అదే రేంజ్‍లో వర్కౌట్ అయింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఈ చిత్రంలోని కొన్ని పాటలు క్లాసిక్‍గా నిలిచిపోయాయి.

ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్‍కు అందరూ ఫిదా అయ్యారు. జైలులో తొడకొట్టే సీక్వెన్స్, రాయలసీమలో నీరు తాగే సీన్, యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ ఇలా ఈ చిత్రమంతా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌కు ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ మూవీలో కామెడీ టైమింగ్‍తోనూ మెప్పించారు యంగ్ టైగర్.

రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా వీవీ వినాయక్ ఈ మూవీని ఎంగేజింగ్‍గా తెరకెక్కించారు. శ్రీలక్ష్మినరసింహా బ్యానర్‌పై బెల్లకొండ సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతం రీ-రిలీజ్‍ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. దీంతో ఆది చిత్రం కూడా రీ-రిలీజ్‍లో మంచి వసూళ్లనే సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆది రీ-రిలీజ్ థియేటర్ల వద్ద ఫుల్ హంగామా ఉండడం ఖాయం.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్‌ రేంజ్‍కు వెళ్లారు యంగ్ టైగర్. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది.

IPL_Entry_Point