War 2: ఊపిరి తీసుకునే టైమ్ ఉండదేమో.. హృతిక్ రోషన్‌కు గాయాలు.. వార్ 2 షూటింగ్‌ స్టార్ట్-hrithik roshan about his injuries and war 2 movie shooting jr ntr war 2 shooting start on february 23 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hrithik Roshan About His Injuries And War 2 Movie Shooting Jr Ntr War 2 Shooting Start On February 23

War 2: ఊపిరి తీసుకునే టైమ్ ఉండదేమో.. హృతిక్ రోషన్‌కు గాయాలు.. వార్ 2 షూటింగ్‌ స్టార్ట్

Sanjiv Kumar HT Telugu
Feb 17, 2024 06:36 AM IST

Hrithik Roshan JR NTR War 2 Shooting: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న తొలి సినిమా వార్ 2. ఇందులో హీరోగా హృతిక్ రోషన్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వార్ 2 షూటింగ్, తన గాయాల గురించి హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు.

ఊపిరి తీసుకునే టైమ్ ఉండదేమో.. హృతిక్ రోషన్‌కు గాయాలు.. వార్ 2 షూటింగ్‌ స్టార్ట్
ఊపిరి తీసుకునే టైమ్ ఉండదేమో.. హృతిక్ రోషన్‌కు గాయాలు.. వార్ 2 షూటింగ్‌ స్టార్ట్

Hrithik Roshan About War 2 Shooting: ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ నటించనున్న తర్వాతి చిత్రం ఏదో కాదు. ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు.

"అతిత్వరలో వార్ 2 మొదలు కాబోతోంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో" అని హృతిక్ రోషన్ వార్ 2 సినిమా షూటింగ్ గురించి తెలిపారు. 2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్ ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టారు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన వార్ మూవీ అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వార్ 2పై అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి అంచనాలు భారీగా పెరిగాయి.

ఇదిలా ఉంటే వార్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది మూవీ టీమ్. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు. వార్ 2 లో హృతిక్ రోషన్‌తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. ఈ స్పై యూనివర్స్‌లో తారక్ భాగం కాబోతుండడం ఆసక్తిగా మారింది.

యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో తెరకెక్కుతున్న వార్ 2 చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్‌ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట.

గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నారు. ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు. ప్రస్తుతం హృతిక్ కోలుకుంటున్నారు. వచ్చే వారం షూటింగ్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం డార్క్ థీమ్‌లో ఇండియన్ స్క్రీన్‌పై నెవర్ బిఫోర్ యాక్షన్ ఫీస్ట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్న వార్ 2 చిత్రం ఫాన్స్ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇటు సౌత్‌లో ఉన్న అభిమానులకు, నార్త్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు వార్ 2 మూవీ ఒక పండగే అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది ఆగష్టు 14న వార్ 2 సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీర్ ఇందులో విలన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఇదే కాకుండా దేవర మూవీతోనూ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.

IPL_Entry_Point