తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Fan : ఇదేం పిచ్చి! ధోనీ ఫ్యాన్​ చేసిన పని తెలిస్తే.. షాక్​ అవ్వాల్సిందే

MS Dhoni fan : ఇదేం పిచ్చి! ధోనీ ఫ్యాన్​ చేసిన పని తెలిస్తే.. షాక్​ అవ్వాల్సిందే

Sharath Chitturi HT Telugu

29 April 2024, 15:20 IST

    • CSK vs SRH Dhoni fan : సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024 మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి ఎంఎస్ ధోనీపై తనకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ ప్లకార్డును పట్టుకున్నాడు. అందులోని కంటెంట్​ చూసి అందరు షాక్​ అవుతున్నారు.
ఎంఎస్​ ధోనీ..
ఎంఎస్​ ధోనీ.. (PTI)

ఎంఎస్​ ధోనీ..

MS Dhoni IPL 2024 : ఇప్పుడు చాలా మంది ఐపీఎల్​ 2024ని, మరీ ముఖ్యంగా చెన్నై సూపర్​ కింగ్స్​ మ్యాచ్​ని చూడటానికి ప్రధాన కారణం.. ఎంఎస్​ ధోనీ. టీమిండియా మాజీ సారథి, సీఎస్కే మాజీ కెప్టెన్​ని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఫలితంగా.. సీఎస్కే జట్టు ఎక్కడ ఆడుతున్నా.. ఆ స్టేడియం కిక్కిరిసిపోతోంది. ఇక ధోనీ ఫ్యాన్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు! ధోనీని చూసేందుకు వారు ఏదైనా చేస్తారు. వీటిన్నింటి మధ్య.. ఓ ధోనీ ఫ్యాన్​ చేసిన పని గురించి తెలిసి ఇప్పుడు అందరు షాక్​ అవుతున్నారు. ఆ ఫ్యాన్​.. తన గర్ల్​ఫ్రెండ్​కి బ్రెకప్​ చెప్పాడు. అందుకు కారణం ఎంఎస్​ ధోనీ అట!

ట్రెండింగ్ వార్తలు

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

Babar Azam Record: టీ20ల్లో బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లినే మించిపోయాడు

ఇదీ జరిగింది..

ఐపీఎల్​ 2024లో ఆదివారం.. చపాక్​ వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ మ్యాచ్​ జరిగింది. మ్యాచ్​లో ఓ వ్యక్తి ప్లెకార్డ్​ పట్టుకుని కనిపించాడు.

'నా గర్ల్​ఫ్రెండ్​ పేరులో ఏడు అక్షరాలు లేవు. అందుకే నా ప్రియురాలితో విడిపోయాను,' అని ఆ ప్లకార్డ్​లో రాసి ఉంది. అతను సీఎస్కే జెర్సీ వేసుకుని ఉన్నాడు.

MS Dhoni fan : ఎంఎస్​ ధోనీ జెర్సీ నెంబర్​, బర్త్​ డేట్​.. 7 అన్న విషయం అందరికి తెలిసింది.

సీఎస్కే అభిమాని ప్లకార్డును ఇక్కడ చూడండి:

మరి ఇది ఎంత వరకు నిజమో తెలియరాలేదు! ఆ ధోనీ ఫ్యాన్​ నిజంగానే గర్ల్​ఫ్రెండ్​ని వదిలేశాడా? లేక ఫన్నీగా ప్లకార్డ్​ పట్టుకున్నాడా? అనేది చర్చ జరుగుతోంది.

కాగా.. ధోనీ పేరుతో అభిమానులు ఇలాంటి పనులు చేయడం ఇది కొత్తేమీ కాదు! ఈ ఐపీఎల్​ 2024లోనే కొన్ని రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. ఈ వ్యక్తి.. తన పిల్లల్ని స్టేడియంకు తీసుకెళ్లి, ధోనీని చూపించాడు. అందరు సంతోషంగా ఇంటికి వెళ్లారు. అయితే.. ఆ మ్యాచ్​కు టికెట్లు దొరకకపోవడంతో రూ. 64వేలు ఖర్చు చేసి, బ్లాక్​లో టికెట్లు కొని మరీ తన పిల్లల్ని స్టేడియంకు తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. కాగా.. తన పిల్లల స్కూల్​ ఫీజు కూడా కట్టలేదని, ఆ డబ్బులతోనే మ్యాచ్​కు వచ్చామని చెప్పడం గమనార్హం.

ఇదీ చూడండి:- MS Dhoni record: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు ధోనీ.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సీఎస్కే మాజీ కెప్టెన్

సన్​రైజర్స్​ హైదరాబాద్​పై చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ ఐపీఎల్ సీజన్​లో ఐదో విక్టరీని నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. మైఖేల్ హస్సీని వెనక్కి నెట్టి సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు.

IPL 2024 updates : ఐపీఎల్ 2024 ర్యాంకింగ్స్​లో చెన్నై ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి రెండు మ్యాచ్​లను మే 1, 5 తేదీల్లో పంజాబ్ కింగ్స్​తో ఆడనుంది.

తదుపరి వ్యాసం