Indraja: స్టార్ హీరో అయినా నాతో అలా ఉండేవారు.. సీఎం పెళ్లాం టీజర్ లాంచ్‌లో హీరోయిన్ ఇంద్రజ కామెంట్స్-indraja comments on suman ajay ali in cm pellam teaser movie launch directed by gaddam venkatarama reddy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indraja: స్టార్ హీరో అయినా నాతో అలా ఉండేవారు.. సీఎం పెళ్లాం టీజర్ లాంచ్‌లో హీరోయిన్ ఇంద్రజ కామెంట్స్

Indraja: స్టార్ హీరో అయినా నాతో అలా ఉండేవారు.. సీఎం పెళ్లాం టీజర్ లాంచ్‌లో హీరోయిన్ ఇంద్రజ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 17, 2024 08:41 AM IST

Indraja About Suman In CM Pellam Teaser Launch: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సీఎం పెళ్లాం. గడ్డం వెంకట రమణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సీఎం పెళ్లాం టీజర్‌ను సోమవారం (సెప్టెంబర్ 16) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రజ కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

స్టార్ హీరో అయినా నాతో అలా ఉండేవారు.. హీరోయిన్ ఇంద్రజ కామెంట్స్
స్టార్ హీరో అయినా నాతో అలా ఉండేవారు.. హీరోయిన్ ఇంద్రజ కామెంట్స్

Indraja CM Pellam Teaser Release: సీనియర్ యాక్టర్స్ జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "సీఎం పెళ్లాం". ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం వెంకట రమణరెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సందేశాత్మక చిత్రం

ఈ నేపథ్యంలో "సీఎం పెళ్లాం" సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం సోమవారం (సెప్టెంబర్ 16) హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ - "ఈ రోజు మా సినిమా సీఎం పెళ్లాం టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది" అని తెలిపారు.

"ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం. చాలా మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని డైరెక్టర్ వెంకటరమణ అన్నారు.

భిన్నమైన పాత్ర

నటుడు సుమన్ మాట్లాడుతూ - "సీఎం పెళ్లాం సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్‌కు భిన్నమైన పాత్రలో కనిపిస్తా. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ వెంకటరమణారెడ్డి పూర్తి స్క్రిప్ట్‌తో ప్రతి డీటెయిల్‌తో రెడీ అయి సినిమా చేశారు. ఆయన డెడికేషన్ నాకు నచ్చింది" అని అన్నారు.

"నాతో పాటు ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రలు చేశారు. అజయ్ మంచి నటుడు, అతను ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఇంద్రజ గతంలో నాతో పాటు హీరోయిన్‌గా నటించింది. ఆమెతో మళ్లీ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. చాలా మంచి ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. మన రాజకీయ, బ్యూరోక్రాట్ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక మంచి మూవీ చేశారు దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి. ఈ సినిమాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా" అని సుమన్ తెలిపారు.

"సుమన్ గారితో ఎన్నో మూవీస్ చేశాను. ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉంది. ఆయన అప్పటికే స్టార్ హీరో అయినా కొత్త హీరోయిన్‌గా వచ్చిన నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. సీఎం పెళ్లాం క్యారెక్టర్‌లో సీఎం భార్య పాత్రలో నటించాను. ఈ పాత్రను నేను చేయగలను అని నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకటరమణరెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నా" అని ఇంద్రజ పేర్కొన్నారు.

అలీకి థ్యాంక్స్

"ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది. దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ టీజర్ లాంచ్‌కు వచ్చి సపోర్ట్ చేస్తున్న అలీ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని ఇంద్రజ అన్నారు.

నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ - "దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారు ఒక మంచి స్క్రిప్ట్ నాకు వినిపించారు. వెంటనే మూవీ స్టార్ట్ చేశాం. రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ఇది. మహిళా సాధికారత గురించి కూడా కంటెంట్ ఉంటుంది. సుమన్ గారు, ఇంద్రజ, అజయ్ గారితో మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం" అని అన్నారు.

"సుమన్ గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది. అలాగే మహిళా సాధికారత గురించి కూడా మా డైరెక్టర్ చూపించారు. మా డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారి మంచితనం నన్ను ఆకట్టుకుంది. ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఇంద్రజ గారు ఈ సినిమాలో హీరో అని చెప్పాలి. ఒక మంచి మూవీ చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని నటుడు అజయ్ తెలిపారు.

"దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వం మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. 20 ఏళ్ల కిందట ప్రకాష్ రాజ్ గారితో ఓ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లిపోయాడు. అక్కడ బాగా స్థిరపడ్డాడు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉండనీయదు కదా మళ్లీ వచ్చాడు. సీఎం పెళ్లాం అనే మంచి మూవీ రూపొందించాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా" అని అలీ అన్నారు.

నటి స్వాతి మాట్లాడుతూ - "సీఎం పెళ్లాం సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశాను. నేను వరుణ్ సందేశ్ కుర్రాడు మూవీలో ఆయనకు చెల్లిగా నటించా. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై చదువు, ఉద్యోగంలో స్థిరపడ్డా. మళ్లీ ఈ మూవీతో ఇండస్ట్రీకి రావడం సంతోషంగా ఉంది" అన్నారు.

నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ - "సీఎం పెళ్లాం సినిమాలో మంచి రోల్ చేశాను. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో మా ఆర్టిస్టులు ఎవరినీ ఇబ్బందులు పెట్టలేదు దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారు. ఆయన చాలా క్లారిటీగా మూవీ రూపొందించి మమ్మల్ని రోజు సెట్ నుంచి అనుకున్న టైమ్ కంటే ముందే పంపించేవారు. సీఎం పెళ్లాం సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది" అని అన్నారు.

నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నేను హోం మంత్రి పాత్రలో నటించాను. పొలిటికల్ నేపథ్యంతో సాగే ఒక మంచి చిత్రమిది. ఈ చిత్రంలో ఇంద్రజ, సుమన్, అజయ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ బొల్లా రామకృష్ణ గారికి థ్యాంక్స్" అన్నారు.

కాగా ఈ సీఎం పెళ్లాం సినిమాలో జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్, ఘర్షణ శ్రీనివాస్, మురళీధర్, ప్రీతి నిగమ్, రూపా లక్ష్మి, స్వాతి తదితరులు నటించారు.

సీఎం పెళ్లాం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్
సీఎం పెళ్లాం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్