OTT: ఓటీటీలో మలయాళ క్రైమ్ కామెడీ సినిమా రికార్డ్.. మెగాస్టార్ సిరీస్‌ను అధిగమించి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Nunakuzhi OTT Streaming Record In Pre Subscription: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ క్రైమ్ కామెడీ సినిమా నునాకుజి రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, సూపర్ స్టార్ మోహన్ లాల్ వెబ్ సిరీస్ మనోరథంగల్‌ను సైతం అధిగమించింది.
Nunakuzhi OTT Release: మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. మాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుందని, అవి బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయని పేరు తెచ్చుకున్నాయి. దాంతో మలయాళ సినిమాలు చూసేందుకు దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
ఓటీటీలో రికార్డ్
కథ ఎలా ఉన్న టేకింగ్‌తో అలరిస్తుంటారు మలయాళ దర్శకులు. అయితే, తాజాగా ఓ మలయాళ కామెడీ సినిమా ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నునాకుజి సినిమా సెప్టెంబర్ 23న ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చింది. జీ5 ఓటీటీలో నునాకుజి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లాక్ బస్టర్ హిట్
అయితే, ఇండియాలో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకుసాగుతోన్న స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో జీ5 కూడా ఒకటి. ఇలాంటి మాధ్యమంలో రీసెంట్‌గా థియేటర్స్‌లో మంచి విజయాన్ని అందుకున్న నునాకుజి ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోని ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
మమ్ముట్టి మోహన్ లాల్ సిరీస్
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కావటాని కంటే ముందే జీ5 కేరళలో అత్యధిక ప్రీ సబ్‌స్క్రిప్షన్స్‌ను సాధించింది. ఈ క్రమంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సూపర్ స్టార్ మోహన్ లాల్, పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్, మధుబాల, పార్వతి తిరువోతు వంటి దిగ్గజ యాక్టర్స్ నటించిన వెబ్ సిరీస్ మనోరథంగల్‌ను అధిగమించడం విశేషంగా మారింది.
తెలుగులో కూడా స్ట్రీమింగ్
మనోరథంగల్‌తోపాటు పప్పన్, సూపర్ శరణ్య చిత్రాలను కూడా నునాకుజి చిత్రం అధిగమించింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్‌ను మరో విలక్షణమైన పాత్రలో చూపించారు. అది ఆడియెన్స్‌కు ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నునాకుజి సినిమా సెప్టెంబర్ 13 నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడలో జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ల్యాప్ ట్యాప్ సీజ్
ఇదిలా ఉంటే, నునాకుజి సినిమా కథ విషయానికొస్తే.. ఎబీ (బాసిల్ జోసెఫ్)కు సంబంధించిన కథ. ఇతని ల్యాప్ ట్యాప్‌ను ఓ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సీజ్ చేస్తాడు. అందులో ముఖ్యమైన సమాచారం అంతా ఉంటుంది. దాన్ని తిరిగి పొందటానికి ఎబీ ఏం చేశాడనేదే సినిమా కథ. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న రెష్మిత (గ్రేస్ ఆంటోని) అనే మహిళతో కలిసి ప్రయాణం చేస్తాడు ఎబీ.
ఊహించని ట్విస్టులు
అలాగే తన ప్రయాణంలో చనిపోయిన ఓ దంతవైద్యుడు, నిర్బంధంలోని ఓ మహిళ, ఫిల్మ్ మేకర్ కావాలనుకునే వ్యక్తి తారసపడతారు. వారి మధ్య అపార్థాలు, కథలో ఉహించని ట్విస్టులు ఎదురవుతాయి. ఎబీ తన రహస్యాలను బయట పడకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఓ ట్విస్ట్ కారణంగా తన విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.
మంచి క్రైమ్ కామెడీ మూవీ
ఇలా ఉహించని మలుపులతో పాటు చక్కటి హాస్యం, క్రైమ్ సన్నివేశాలతో మిళితమైన సినిమాగా నునాకుజి ప్రేక్షకులను మెప్పించింది. అందుకే థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మంచి కామెడీ సినిమా చూడాలనుకునేవారికి నునాకుజి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.