OTT Releases: ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్కరోజే 16 స్ట్రీమింగ్.. చూడాల్సినవి 12.. ఎక్కడంటే?
OTT Movies To Release On Friday: ఓటీటీలో ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 16 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవన్నీ ఓటీటీ రిలీజ్ అయిన శుక్రవారం (సెప్టెంబర్ 13) నాడు ఫ్రైడే ఫెస్టివల్ జరిగినట్లు అయింది. ఈ పదహారింట్లో ఒక నాలుగు మినహాయిస్తే.. ఏకంగా 12 వరకు చూడాల్సినవిగా స్పెషల్‌గా ఉన్నాయి.
OTT Releases On Friday: ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఎప్పుడు అలరిస్తూ సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం చాలా స్పెషల్‌గా మారింది. ఎందుకంటే ఈ వారంలో దాదాపుగా 30 వరకు ఓటీటీ రిలీజెస్ కాగా వాటిలో గురు (సెప్టెంబర్ 12), శుక్రవారాల్లో ఎక్కువగా విడుదల అయ్యాయి. ఇక ఒక్క శుక్రవారం (సెప్టెంబర్ 13) రోజునే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 16 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
సెక్టార్ 36 (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 13
అగ్లీస్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13
ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ (కొరియన్ చిత్రం)- సెప్టెంబర్ 13
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
గోలి సోడా రైజింగ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 13
హౌ టు డై ఎలోన్- సెప్టెంబర్ 13
ఇన్ వోగ్ ది 90స్ (డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13
లెగో స్టార్ వార్స్: రీబిల్డ్ ది గెలాక్సీ (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 13
జీ5 ఓటీటీ
రఘుతాత (తమిళ పొలిటికల్ కామెడీ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 13
బెర్లిన్ (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 13
నునాకుజి (మలయాళ సినిమా)- సెప్టెంబర్ 13
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రూపాంతర (కన్నడ అంథాలజీ మూవీ)- సెప్టెంబర్ 13
ఔర్ మే కహో దమ్ థా (హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 13
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
లేట్ నైట్ విత్ ది డెవిల్ (ఇంగ్లీష్ హారర్ సినిమా)- సెప్టెంబర్ 13
ది రెంటల్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబర్ 13
నంబన్ ఒరువన్ వంత పిరగు (తమిళ కామెడీ మూవీ)- ఆహా తమిళ్ ఓటీటీ- సెప్టెంబర్ 13
స్పార్క్ (తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- సెప్టెంబర్ 13
ఇలా ఒక్క శుక్రవారం (సెప్టెంబర్ 13) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 16 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సెక్టార్ 36, గోలీసోడా రైజింగ్ వెబ్ సిరీస్, కీర్తి సురేష్ తమిళ పొలిటికల్ డ్రామా రఘుతాత, స్పై ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బెర్లిన్, కన్నడ అంథాలజీ మూవీ రూపాంతర, రెండు హారర్ సినిమాలు లేట్ నైట్ విత్ ది డెవిల్, ది రెంటల్ చూడాల్సినవిగా ఉన్నాయి.
అలాగే, అజయ్ దేవగన్ బాలీవుడ్ సినిమా ఔర్ మే కహో దమ్ థా రెంటల్ విధానంలో అందుబాటులో ఉండి ఇంట్రెస్టింగ్‌గా మారింది. నంబన్ ఒరువన్ వంత పిరుగు అనే తమిళ కామెడీ సినిమా, ఇదివరు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇప్పుడు మరో ఓటీటీ అయిన సన్ ఎన్ఎక్స్‌టీలోకి వచ్చిన మెహ్రీన్ ఫిర్జాదా స్పార్క్ మూవీ కూడా స్పెషల్ అయ్యాయి.
అలాగే, మలయాళ సినిమా నునాకుజి, స్టార్ వార్ సిరీస్ ఫ్యాన్స్‌కు లెగో స్టార్ వార్స్: రీబిల్డ్ ది గెలాక్సీ కూడా కాస్తా క్యూరియాసిటీ కలిగించే మూవీలు అయ్యాయి. ఇలా ఫ్రైడే ఫెస్టివల్‌లో భాగంగా ఓటీటీ రిలీజ్ అయిన పదహారింటిలో పదకొండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో మొత్తం 12 చూడాల్సినవిగా స్పెషల్ స్థానం సంపాదించుకున్నాయి.