Mammootty: మలయాళ సినిమాలకు ఇది ప్రత్యేకమైనది.. నేను చదవలేకపోయాను.. మెగాస్టార్ మమ్ముట్టి కామెంట్స్
Mammootty MT Vasudevan Nair Manoradhangal Web Series: ప్రముఖ సాహితీ దిగ్గజం ఎమ్‌టీ వాసుదేవన్ నాయర్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన రచించిన ఓటీటీ వెబ్ సిరీస్ మనోరథంగల్‌కు సంబంధించి కామెంట్స్ చేశారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.
Mammootty Manoradhangal Web Series: మలయాళ చిత్రసీమ కొత్త శకానికి నాంది పలికింది. మలయాళ దిగ్గజ నటులంతా కలిసి సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్‌లో రూపొందిస్తున్నారు. దాని పేరే మనోరథంగల్. M.T. అని ముద్దుగా పిలుచుకునే సాహితీ దిగ్గజం మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ 90వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన రచించినఈ అద్భుతమైన వెబ్ సిరీస్‌ను తాజాగా ప్రారంభించారు.
ఈ మనోరథంగల్ వెబ్ సిరీస్ ఆగస్టు 15న ప్రీమియర్‌గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. మనోరథంగల్ వెబ్ సిరీస్ వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల సంకలనమే ఈ వెబ్ సిరీస్. ఈ తొమ్మిది కథలకూ ఓ కనెక్షన్ ఉంటుంది. 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ దర్శకులతో ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో రానుంది.
ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆసక్తకిర విశేషాలు చెప్పారు. "ఈ సాయంత్రం మలయాళ సినిమాలకు ప్రత్యేకమైనది. ఎందుకంటే మన పరిశ్రమలో ఇలాంటి వెబ్ సిరీస్‌లు రావడం చాలా అరుదు. నాకు ఎం.టి. వాసుదేవన్ నాయర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. సమకాలీన సాహిత్యం, రచనల్లో ఎం.టి. పరిజ్ఞానం విశేషమైనది" అని మమ్ముట్టి తెలిపారు.
"ఆయన ఇటీవల నాకు ఇచ్చిన పుస్తకాన్ని నేను చదవలేకపోయినప్పటికీ, నా కుమార్తె ఆ పుస్తకాన్ని ఇష్టపడింది. తాజా తరం అభిరుచులకు అనుగుణంగా ఆయన రచనలు చేస్తున్నారు. మొదట్లో రంజిత్‌తో కలిసి కడుగన్నవ కథను రెండు గంటల ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించాలని ప్లాన్ చేశాం. ఈ పార్ట్‌ను శ్రీలంకలో షూట్ చేశాం" అని మెగాస్టార్ మమ్ముట్టి చెప్పుకొచ్చారు.
"ఆయన రచనలను చదివి పెరిగిన వారిలో వ్యామోహాన్ని రేకెత్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. మలయాళీలు ఆయన రచనల ద్వారా సాహిత్య విలువను గ్రహించారు. నేను ఆయన కథలన్నింటినీ చదవడానికి ప్రయత్నించాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చెప్పారు.
నటుడు ఇంద్రజిత్ మాట్లాడుతూ.. "ఎమ్‌టి వాసుదేవన్ నాయర్ స్క్రిప్ట్‌లో హీరోగా నటించే అవకాశం మళ్లీ వచ్చింది. ఆయన కథలో నటించడం ఇది రెండో సారి. నేను ఇందులో కదల్‌క్కట్టు అనే భాగంలో కనిపిస్తాను. ఎమ్‌టి సార్ రాసిన బంధనం అనే చిత్రంలో మా నాన్న కూడా నటించారు. ఎమ్‌టీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.
కాగా ఈ తొమ్మిది కథలకు ఎనిమిది మంది టాప్ డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. వాటిలో మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ నటించారు.
ఈ తొమ్మిది కథలకు ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి టాప్ డైరెక్టర్స్ దర్శకత్వం వహించారు. అయితే, వీటిలో రెండు కథలకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మిగతా వారు ఒక్కొక్క స్టోరిని తెరకెక్కించారు.
టాపిక్