Sunday Girlfriend: లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా సండే గర్ల్ ఫ్రెండ్.. సుమన్, అలీతో నటించే అవకాశం!-sunday girlfriend movie launch and director venkata ramana reddy invitation actors ali suman kamna sharma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunday Girlfriend: లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా సండే గర్ల్ ఫ్రెండ్.. సుమన్, అలీతో నటించే అవకాశం!

Sunday Girlfriend: లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా సండే గర్ల్ ఫ్రెండ్.. సుమన్, అలీతో నటించే అవకాశం!

Sanjiv Kumar HT Telugu

Sunday Girlfriend Movie Launch And Invites To Actors: లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు సినిమా సండే గర్ల్‌ ఫ్రెండ్. సీనియర్ హీరో సుమన్, కమెడియన్ అలీ, హీరోయిన్ కామ్నా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సోమవారం (సెప్టెంబర్ 16) ఘనంగా లాంచ్ అయింది.

లవ్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా సండే గర్ల్ ఫ్రెండ్.. సుమన్, అలీతో నటించే అవకాశం!

Sunday Girlfriend Movie Launch: కామ్నా శర్మ, సుమన్, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "సండే గర్ల్ ఫ్రెండ్". ఈ చిత్రాన్ని లార్విన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ కథతో దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ముఖ్య అతిథులుగా

ఈ సినిమాకు గడ్డం వెంకటరమణ రెడ్డి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌తో పాటు లిరిక్స్ కూడా అందిస్తుండటం విశేషం. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా సోమవారం (సెప్టెంబర్ 16) హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సండే గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రారంభోత్సవంలో సీనియర్ హీరో సుమన్, హీరోయిన్ ఇంద్రజ, స్టార్ కమెడియన్ అలీ అతిథులుగా పాల్గొన్నారు.

"సండే గర్ల్ ఫ్రెండ్" ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి నటుడు అలీ క్లాప్‌నివ్వగా, సుమన్ స్క్రిప్ట్ అందజేశారు. ఇంద్రజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అతిథులు సండే గర్ల్ ఫ్రెండ్ చిత్ర బృందానికి తమ బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు గడ్డం వెంకటరమణా రెడ్డి ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు. అలాగే ప్రతిభావంతులైన యాక్టర్స్‌కు నటించే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.

నేటి ట్రెండ్ లవ్ స్టోరీతో

"నేను ప్రస్తుతం సీఎం పెళ్లాం అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఆ సినిమా రాజకీయ నేపథ్యంతో మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అయితే నా నెక్ట్ మూవీ అదే జానర్‌లో కాకుండా పూర్తిగా నేటి ట్రెండ్ లవ్ స్టోరీతో చేస్తున్నాను. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది" అని డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి తెలిపారు.

"ఈ సినిమాలో పాటలు చాలా ట్రెండీ లిరిక్స్‌తో కంపోజిషన్‌తో ఉంటాయి. పాటల రికార్డింగ్ కంప్లీట్ అయింది. ప్రతిభావంతులైన నటీనటులను మా మూవీలోకి తీసుకుంటాం. వారికి ఇదే మా ఆహ్వానం. త్వరలోనే సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం" అని చెప్పుకొచ్చారు.

తెలుగు ప్రేక్షకులకు

అలాగే, ఈ సందర్భంగా హీరోయిన్ కామ్నా శర్మ మాట్లాడుతూ.. "నేను ముంబై నుంచి వచ్చాను. సండే గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం అందించిన దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా" అని తెలిపారు.

"ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్‌ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. నాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా" అని సండే గర్ల్ ఫ్రెండ్ మూవీ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ కామ్న శర్మ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో కామ్నా శర్మ, సుమన్, అలీతోపాటు ఘర్షణ శ్రీనివాస్, షాలినీ నాయుడు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టెక్నిషియన్స్

లార్విన్ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సండే గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కెమెరా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నాగ శ్రీనివాసరెడ్డి, ఎడిటర్‌గా రామారావు పనిచేస్తున్నారు. అలాగే, ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌ సండే గర్ల్ ఫ్రెండ్ మూవీ లాంచ్
లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌ సండే గర్ల్ ఫ్రెండ్ మూవీ లాంచ్