Indraja Shankar: నటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజ.. మేనమామను పెళ్లి చేసుకున్నారా? నిజమిదే-who is karthik who married robo shankar daughter indraja check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Who Is Karthik Who Married Robo Shankar Daughter Indraja Check Details

Indraja Shankar: నటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజ.. మేనమామను పెళ్లి చేసుకున్నారా? నిజమిదే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 26, 2024 03:56 PM IST

Robo Shankar Daughter Indraja Marriage: తమిళ నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ వివాహం చేసుకున్న కార్తీక్‍.. ఆమెకు మేనమామ అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై కార్తీక్ క్లారిటీ ఇచ్చారు. నిజమేంటో వెల్లడించారు.

Robo Shankar Daughter: నటుడు రోబో శంకర్ కూతురు మేనమామను పెళ్లి చేసుకున్నారా? నిజమిదే
Robo Shankar Daughter: నటుడు రోబో శంకర్ కూతురు మేనమామను పెళ్లి చేసుకున్నారా? నిజమిదే

Robo Shankar Daughter: తమిళ సీనియర్ నటుడు రోబో శంకర్ చాలా సినిమాల్లో నటించారు. కమెడియన్‍గా చాలా తమిళ చిత్రాల్లో మెప్పించారు. కుమార్తె ఇంద్రజ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఇప్పటికే బిగిల్ సహా మరో రెండు చిత్రాల్లో ఆమె నటించారు. నటి ఇంద్రజ వివాహం ఇటీవలే కార్తీక్‍తో జరిగింది. అయితే, ఇంద్రజకు కార్తీక్ మేనమామ అనే రూమర్లు వచ్చాయి. అయితే, ఈ విషయంపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ స్పందించారు.

ఇంద్రజ - కార్తీక్ నిశ్చితార్థం కొన్నినెలల క్రితం జరగగా.. వీరి వివాహం ఇటీవలే చెన్నైలో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి గ్రాండ్‍గా సాగింది. కొందరు సినీ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇంద్రజ, కార్తీక్ సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.

కార్తీక్ ఓ ఛారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎదుగుతున్నారు. త్వరలోనే కార్తీక్ - ఇంద్రజ వివాహ రిసెప్షన్‍ కూడా జరగనుందని తెలుస్తోంది. ఈ రిసెప్షన్‍కు సినీ ప్రముఖులు భారీగా హాజరవుతారని తెలుస్తోంది. అయితే, ఇంద్రజ తన మేనకోడలు అనే రూమర్లపై కార్తీక్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

మేనమామను కాదు

ఇంద్రజ తల్లి ప్రియాంకకు కార్తీక్ సొంత సోదరుడు అనే రూమర్లు బయటికి వచ్చాయి. ఇంద్రజకు కార్తీక్ మేనమామ అవుతాడని కొందరు అనుకున్నారు. ఈ విషయంపై తొలిసారి కార్తీక్ స్పందించారు. తాను ఇంద్రజకు మేనమామను కాదని బిహైండ్‍వుడ్ అనే యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

తనను సోదరుడిగా ప్రియాంక దత్తత తీసుకున్నారని కార్తీక్ వెల్లడించారు. “నేను ప్రియాంక సొంత తమ్ముడిని కాదు. రోబో శంకర్, ప్రియాంక మా ట్రస్ట్ సభ్యులు. నన్ను తమ్ముడిగా ప్రియాంక దత్తత తీసుకున్నారు. నేను, ప్రియాంక సొంత అక్కాతమ్ముళ్లం అని చాలా మంది అనుకున్నారు. నేను మా అమ్మతో కలిసి పెళ్లి పత్రికలు పంచే సమయంలోనూ చాలా మంది అలానే అన్నారు” అని కార్తీక్ క్లారిటీ ఇచ్చేశారు.

మొత్తంగా.. తాను పెళ్లి చేసుకున్న ఇంద్రజ తన మేన కోడలు కాదని కార్తీక్ స్పష్టం చేశారు. ప్రియాంక తనను తమ్ముడిగా దత్తత తీసుకున్నారని చెప్పేశారు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది.

ఇంద్రజ శంకర్.. సర్వైవర్ అనే తమిళ రియాల్టీ షోలోనూ పాల్గొన్నారు. 2019లో వచ్చిన బిగిల్ చిత్రంలో పండియమ్మ అనే క్యారెక్టర్ చేశారు. తెలుగులో విశ్వక్‍సేన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన పాగల్ చిత్రంలోనూ ఇంద్రజ కనిపించారు. 2022లో విరుమన్ చిత్రంలోనూ కీలకపాత్ర పోషించారు.

తమిళ కమెడియన్ శంకర్.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయ్యారు. దీంతో ఆయనకు రోబో శంకర్‌గా పేరు వచ్చింది. చాలా చిత్రాల్లో హస్య నటుడిగా ఆయన చేశారు. స్టార్ హీరోలతో కలిసి నటించారు. స్టాండప్ కమెడియన్‍గా కెరీర్ మొదలుపెట్టిన రోబో శంకర్.. సినిమాల్లో పాపులర్ నటుడిగా ఎదిగారు. ఇప్పుడు ఆయన కూతురు ఇంద్రజ కూడా సినీ రంగంపైనే పూర్తి దృష్టి సారించారు. నటిగా ఎదుగుతున్నారు. 

IPL_Entry_Point