Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్‌గా కమెడియన్ అలీ తమ్ముడు కన్ఫర్మ్.. ఖయ్యూమ్ చరిత్ర ఇదే!
Comedian Ali Brother Khayyum In Bigg Boss 8 Telugu: సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి కమెడియన్ అలీ సోదరుడు, నటుడు ఖయ్యూమ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఖయ్యూమ్ అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఖయ్యూమ్ చరిత్ర వివరాల్లోకి వెళితే..
Actor Khayyum In Bigg Boss Telugu 8: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. లిమిట్ లెస్ అంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుంది. బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్‌గా చేస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా అలరించేందుకు రెడీ అయ్యారు.
ఇప్పటికీ పదిమంది
ఇదివరకు విడుదలైన బిగ్ బాస్ 8 తెలుగు ప్రోమో, ప్రమోషనల్ కంటెంట్ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రీసెంట్‌గానే సెప్టెంబర్ 1న బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ లాంచ్ కానుందని వీడియో ద్వారా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లపై అందరి దృష్టి పడింది. ఇప్పటికీ హౌజ్‌లోకి వెళ్లేందుకు పది మంది సెలబ్రిటీలు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం అందింది.
తాజాగా ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి స్టార్ కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త జోరందుకుంది. అన్న అలీ అంత పేరు తెచ్చుకోకపోయినా నటుడిగా, హీరోగా, కమెడియన్‌గా అలరించిన ఖయ్యూమ్ బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్‌గా నూటికి 99 శాతం కన్ఫర్మ్ అయ్యాడని పక్కా సమాచారం.
మహేష్ బాబు మూవీతో
అయితే, కమెడియన్ అలీ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఖయ్యూమ్ మహేష్ బాబు రాజకుమారుడు మూవీతో యాక్టింగ్ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత హీరో సుమంత్ ప్రేమ కథ, శ్రీయ తొలి సినిమా ఇష్టం, అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ హీరోగా చేసిన హాయ్, మనసుతో వంటి సినిమాల్లో హీరోకు ఫ్రెండ్‌గా కనిపించాడు.
హీరోగా డెబ్యూ
కానీ, ఈ సినిమాలు ఏవి ఖయ్యూమ్‌కు నటుడిగా అంత గుర్తింపు తీసుకురాలేకపోయాయి. అనంతరం 2004లో ఎంజాయ్ అనే సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. కానీ, అది కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా తర్వాత 2005లో పూరి జగన్నాథ్, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ మూవీతో కొంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఖయ్యూమ్.
ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన బ్లేడ్ బాబ్జీ, మడత కాజా, కెవ్వు కేక వంటి కామెడీ సినిమాల్లో కమెడియన్‌గా తనదైన నటనతో మెప్పించాడు. అనంతరం ఖయ్యూమ్ మళ్లీ పెద్దగా ఏ సినిమాతో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆయన చివరిగా ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సీఎస్ఐ సనాతన్ (2023) మూవీలో యాక్ట్ చేశాడు.
చాలా వరకు పెద్ద హీరోల సినిమాల్లో నటించిన ఖయ్యూమ్‌కు నటుడిగా, కమెడియన్‌గా సరైన గుర్తింపు రాలేదు. ఒకవేళ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి అడుగుపెడితే పాపులర్ అయ్యే అవకాశం చాలానే ఉంది. అయితే, అది తనకు నెగెటివిటీని లేదా పాజిటివిటీని తీసుకొస్తుంది. బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన ఎంతోమంది ఊహించని రెస్పాన్స్ తెచ్చుకున్నారు.
11 మంది కంటెస్టెంట్స్
కాబట్టి, ఖయ్యూమ్‌కు బిగ్ బాస్ 8 తెలుగు ఎలాంటి అభిప్రాయాన్ని తీసుకొస్తుందే చూడాలి. ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ఎంతమంది హౌజ్ మేట్స్ ఉంటారో తెలియదు కానీ, ఇప్పటి వరకు ఖయ్యూమ్‌తో కలిపి 11 మంది కంటెస్టెంట్స్‌గా కన్ఫర్మ్ అయ్యారు. వారిలో ఇంద్రనీల్, ఆదిత్య ఓం, నిఖిల్ మలిక్కల్, సౌమ్య రావు, రీతూ చౌదరి, యష్మీ గౌడ ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే, బిగ్ బాస్ తెలుగు 8లోకి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్లలో యూట్యూబర్ బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, అంజలి పవన్, హీరో అభిరామ్ వర్మ ఉన్నట్లు సమాచారం.