Aarambham OTT: ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్-aarambham movie director ajay nag about ott movies in success meet aarambham ott tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aarambham Ott: ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్

Aarambham OTT: ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్

Sanjiv Kumar HT Telugu

Director Ajay Nag About Aarambham OTT: ఓటీటీల్లో మంచి సినిమాలను వెతికి మరి చూస్తారని ఆరంభం సినిమా డైరెక్టర్ అజయ్ నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆరంభం మూవీ సక్సెస్ మీట్‌లో ప్రేక్షకుల నుంచి వస్తున్న ఒక్క కంప్లైంట్ గురించి దర్శకుడు అజయ్ నాగ్ చెప్పుకొచ్చారు.

ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్

Aarambham OTT Director Ajay Nag: మోహన్ భగత్ (Mohan Bhagath), సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన "ఆరంభం" మే 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి టాక్ తెచ్చుకుంటోంది.

ఎమోషన్ బాగుంది

ఈ నేపథ్యంలో మే 11న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆరంభం (Aarambham Success Meet) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ రెడ్డి మామిడి మాట్లాడుతూ.. "మా ఆరంభం సినిమా మే 10న థియేటర్స్‌లోకి వచ్చింది. ఫస్ట్ డేనే మా మూవీకి హౌస్ ఫుల్స్ అవుతున్నాయని చెప్పను. కానీ, చూసిన వాళ్లంతా మూవీలో ఎమోషన్ బాగుంది, డ్రామా బాగుందని చెబుతున్నారు" అని అన్నారు.

మెసెజెస్ పంపిస్తున్నారు

"మా ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా (Social Media) పేజెస్‌కు మెసెజెస్ పంపిస్తున్నారు. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి సక్సెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం" అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ రెడ్డి చెప్పారు.

60, 70 పర్సెంట్ ఫిల్

"మా సినిమాకు ప్రతి షో 60, 70 పర్సెంట్ ఫిల్ అవుతున్నాయి. నిన్న ఈవెనింగ్ థియేటర్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ప్రేక్షకులు ఇంకా మరింత మంది మా మూవీ చూసేందుకు రండి. మీరు ఆదరిస్తేనే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేయగలం. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం" అని నిర్మాత అభిషేక్ వీటీ తెలిపారు.

అదొక్కటే కంప్లైంట్

"ఎక్కువ థియేటర్స్‌‌లో మా సినిమా రిలీజ్ కాలేదు. అదొక్కటే ప్రేక్షకుల నుంచి వస్తున్న కంప్లైంట్. మూవీ చూసిన వాళ్లు మాత్రం బాగుందని చెబుతున్నారు. మేము వేసిన ప్రీమియర్ షోలో స్నేహితులు, బంధువులు సినిమాను మెచ్చుకున్నారు. నిన్న ఒక థియేటర్‌కు వెళ్లి చూస్తే క్లైమాక్స్‌కు స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది" అని డైరెక్టర్ అజయ్ నాగ్ (Director Ajay Nag) అన్నారు.

థియేటర్ రిలీజ్ కోసం

"మేమంతా కొత్త వాళ్లం. మా సినిమాకు ప్రేక్షకులు అలా రెస్పాన్స్ ఇవ్వడం హ్యాపీగా అనిపించింది. యూత్ ఆడియెన్స్ మంచి సినిమాలను ఓటీటీలో (OTT Movies) వెతికి మరీ చూస్తారు. మీరంతా ఆరంభం మూవీని థియేటర్‌లో చూడండి. ఇది ఓటీటీలో (Aarambham OTT) వచ్చేవరకు ఆగవద్దు. ఎందుకంటే మేము ఎంతో ఎఫర్ట్ పెట్టి థియేటర్ రిలీజ్ కోసం సినిమాను రెడీ చేశాం. థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది" అని దర్శకుడు అజయ్ నాగ్ తెలిపారు.

ఒకట్రెండు రోజుల్లో

"కాలేజ్ స్టూడెంట్స్ మా సినిమాను చూడండి. మీకు నచ్చుతుంది. మౌత్ టాక్‌తో పాటు కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మరో ఒక ట్రెండు రోజుల్లో షోస్ ఫుల్ అవుతాయని ఆశిస్తున్నాం" అని ఆరంభం సినిమా (Aarambham Movie) డైరెక్టర్ అజయ్ నాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.