OTT Best Movies: 5 ఓటీటీల్లోని 5 బెస్ట్ సినిమాలు ఇవే! ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అంటే?
OTT Best Movies This Weekend: ఓటీటీలో ఈ వీకెండ్‌కు కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు 5 డిఫరెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో సర్వైవల్ థ్రిల్లర్ నుంచి కామెడీ ఎంటర్టైనర్ వరకు ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో చూసేయండి.
Best OTT Movies To Watch: తెలుగు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేందుకు అందుబాటులో అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా ఓటీటీలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి ఈ 5 ఓటీటీల్లో ది బెస్ట్ సినిమాలుగా పరిగణించినవి, టాప్ 1 ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ ఏంటో లుక్కేద్దాం. మరి వాటిలో మీరెన్ని చూశారో చెక్ చేసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విభిన్న కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ప్రతివారం వచ్చి పడుతుంటాయి. అలా ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ హారర్ చిత్రం సైతాన్. అజయ్ దేవగన్, జ్యోతిక, ఆర్ మాధవన్ కీ రోల్స్‌లో నటించిన ఈ సినిమా టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ చిత్రంగా సైతాన్‌ను చెప్పుకోవచ్చు.
సైతాన్ మాత్రమే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో లపాటా లేడీస్, టిల్లు స్క్వేర్, అమర్ సింగ్ చమ్కీలా సినిమాలతోపాటు డెడ్ బాయ్ డిటెక్టివ్స్, యూ వెబ్ సిరీసులు కూడా వీక్షించేందుకు మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒకటి. ఇందులో హాట్‌స్టార్ స్పెషల్ పేరుతో ఒరిజనల్ సినిమాలు, వెబ్ సిరీసులతోపాటు పిల్లలు సైతం ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంటుంది. ఈ ఓటీటీలో టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ ది బెస్ట్‌గా నిలిచిన సినిమా మంజుమ్మల్ బాయ్స్.
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 5 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 2006 గుణ కేవ్స్ ఇన్సిడెంట్, స్నేహమనే ఎమోషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందరి ఆదరాభిమానాలు పొందింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు ఇలా ఎలాంటి భాషా బేధం లేకుండా అన్ని రకాల డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులను అందిస్తోన్న మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్. ఈ ఓటీటీలోకి ఇటీవలే మలయాళ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆవేశం వచ్చి పడింది. ఈ సినిమా టాప్ 1లో ట్రెండ్ అవుతూ బెస్ట్ మూవీగా నిలిచింది.
ఆవేశంతోపాటు అమెజాన్ ప్రైమ్‌లో ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్, ఎక్స్ మూవీ, ఓపెన్ హైమర్, డూన్ పార్ట్ 2 వంటి అనేక సినిమాలు చూసేందుకు మంచి ఆప్షన్. కానీ, వీటిలో కొన్నింటిని మాత్రమే ఎలాంటి రెంటల్ పద్ధతి లేకుండా చూడగలం.
జీ5 ఓటీటీ
అన్ని రకాల కంటెంట్‌తో పాటు ఎక్కువగా హిందీ చిత్రాలు, వెబ్ సిరీసులను స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థ జీ5. ఈ ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా సైలెన్స్ 2. మనోజ్ బాజ్ పాయ్ మెయిన్ లీడ్ రోల్ చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసేందుకు మంచి ఎంపికే. కానీ, దీనికంటే ముందు ప్రీక్వెల్‌గా వచ్చిన సైలెన్స్ మూవీ కూడా మరింత బెటర్ అని చెప్పవచ్చు.
సైలెన్స్ 2 మాత్రమే కాకుండా జీ5 ఓటీటీలో ది మోస్ట్ బెస్ట్ మూవీ జాబితాలో హనుమాన్ కూడా ఉంటుంది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ సినిమాను చూడనివాళ్లు వెంటనే చూసేయండి.
ఆహా ఓటీటీ
అచ్చ తెలుగులో కంటెంట్ ఇచ్చే అరుదైన ఓటీటీ సంస్థల్లో ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ముందుంటుంది. ఇందులో సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా చేస్తున్న సర్కార్ సీజన్ 4 ఎపిసోడ్ 3 టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. దీని తర్వాత కామెడీ మూవీ మై డియర్ దొంగ, మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు, బోల్డ్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
టాపిక్