KBC 16 Question: ఈ ప్రశ్న విలువ రూ.50 లక్షలు.. గిన్నిస్ రికార్డులపై మీకు నాలెడ్జ్ ఉందా? అయితే దీనికి సమాధానం చెప్పండి
KBC 16 Question: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల గురించి మీకు బాగా తెలుసా? అయితే కేబీసీ 16లో అడిగిన ఈ రూ.50 లక్షల విలువైన ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో చూడండి. ఈ ప్రశ్న ఎదుర్కొన్న కంటెస్టెంట్ మాత్రం సమాధానం చెప్పలేక గేమ్ నుంచి వైదొలిగాడు.
KBC 16 Question: కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 16 ఇంట్రెస్టింగా సాగుతోంది. ఆడేవాళ్లకే కాదు.. చూసేవాళ్ల మెదడుకు కూడా పదును పెట్టే ఈ గేమ్ షోలో తాజాగా రూ.50 లక్షల విలువైన ప్రశ్న కంటెస్టెంట్ ను తికమక పెట్టింది. దీంతో జార్ఖండ్ కు చెందిన ఆ వ్యక్తి గేమ్ నుంచి వైదొలిగి రూ.25 లక్షలతో వెళ్లిపోయారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు సంబంధించిన ఆ ప్రశ్న ఏంటో ఇక్కడ చూడండి.
ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?
జార్ఖండ్ కు చెందిన త్రిశూల్ అనే వ్యక్తి 13 ప్రశ్నల వరకు కాన్పిడెంట్ గా ఉంటూ రూ.25 లక్షలు సొంతం చేసుకున్నాడు. 14వ ప్రశ్న విలువ రూ.50 లక్షలు. అయితే ఈ ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేకపోయాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..
గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం ఎక్కువ సార్లు ట్రాన్స్‌లేట్ చేసిన డాక్యుమెంట్ ఏది?
దీనికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అందులో యూఎస్ కాన్‌స్టిట్యూషన్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, కమ్యూనిస్ట్ మానిఫెస్టో, యునైటెడ్ నేషన్స్ ఛార్టర్ ఆప్షన్లు ఇవ్వడంతో త్రిశూల్ దీనికి సమాధానాన్ని అంచనా వేయలేకపోయారు. దీంతో గేమ్ ను అక్కడితో వదిలేయడంతో రూ.25 లక్షలు సొంతం చేసుకున్నారు.
ఇదీ సమాధానం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల ప్రకారం ఏ డాక్యుమెంట్ ను ఎక్కువసార్లు అనువదించారు అన్న ప్రశ్నకు సరైన సమాధానం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దీని గురించి ప్రపంచమంతా అన్ని దేశాల్లోని ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఏకంగా 577 సార్లు దీనిని ట్రాన్స్‌లేట్ చేయడం విశేషం.
ఎన్నో భాషలు, యాసల్లోనూ దీనిని అనువదించారు. 1999లోనే ఈ వరల్డ్ రికార్డును యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికి 577 సార్లు అనువదించగా.. ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు.
ఈ ప్రశ్న విలువ రూ.కోటి..
గతంలో ఇదే కేబీసీ 16లో నరేషి మీనా అనే ఓ కంటెస్టెంట్ వచ్చారు. ఈ సీజన్లో తొలి క్రోర్‌పతి అయ్యేలా కనిపించారు. ఆమె ముందు రూ.కోటి విలువైన ప్రశ్న ఉంచాడు బిగ్ బీ. కానీ ఆమె మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. ఆ ప్రశ్న ఏంటంటే.. "వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ లో లీలా రౌ దయాల్ ఎవరిని ఓడించి ఇండియా తరఫున సింగిల్స్ మ్యాచ్ గెలిచి తొలి భారతీయురాలిగా నిలిచింది?" అని బిగ్ బీ అడిగాడు. దీనికి ఇచ్చిన ఆప్షన్లు.. లాటీ డాడ్, గ్లాడిస్ సౌత్‌వెల్, మే సేటన్, కిట్టీ గాడ్‌ఫ్రే.
సరైన సమాధానం ఏంటంటే?
ఈ ప్రశ్న నరేషిని అయోమయానికి గురి చేసింది. ఆమె ఆప్షన్ బి, డి మధ్య ఏది సరైనదో తేల్చుకోలేక గేమ్ ను క్విట్ చేసింది. దీంతో రూ.50 లక్షలతో ఆమె సరిపెట్టుకుంది. క్విట్ అయిన తర్వాత ఏదో ఒక సమాధానం అంచనా వేయాల్సిందిగా అడగ్గా.. ఆమె ఆప్షన్ ఎ.. లాటీ డాడ్ పేరు చెప్పింది. కానీ ఆ సమాధానం తప్పని తేలింది.
నిజానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం గ్లాడిస్ సౌత్‌వెల్. 1934లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్షిప్స్ లో లీలా ఈ ఘనత సాధించింది. ఆమె ఆ మరుసటి ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లోనూ రెండో రౌండ్ చేరుకుంది.