Dr. Reddy's Laboratories: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు-dr reddys laboratories glycemic happiness awareness program wins guinness world record ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dr. Reddy's Laboratories: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు

Dr. Reddy's Laboratories: డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 07:09 PM IST

అతి పెద్ద బ్రోచర్ మొజాయిక్ (లోగో) ను ఇన్‌స్టాల్ చేసి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పామని గ్లోబల్ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రకటించింది. టైప్ 2 డయాబెటిస్ మెల్లటిస్ రోగులకు గ్లైసిమిక్ హ్యాపీనెస్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ మొజాయిక్ లోగోను ఏర్పాటు చేశామని తెలిపింది.

గిన్నిస్ రికార్డుతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రతినిధులు
గిన్నిస్ రికార్డుతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రతినిధులు

అతి పెద్ద బ్రోచర్ మొజాయిక్ (లోగో) ను ఇన్‌స్టాల్ చేసి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పామని గ్లోబల్ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రకటించింది. టైప్ 2 డయాబెటిస్ మెల్లటిస్ రోగులకు గ్లైసిమిక్ హ్యాపీనెస్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ మొజాయిక్ లోగోను ఏర్పాటు చేశామని తెలిపింది. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ప్రవేశించిన ఈ అతిపెద్ద ఇన్ స్టాలేషన్ 162 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ నిపుణుల అభిప్రాయాలను ఈ గ్లైసిమిక్ హ్యాపీనెస్ స్కేల్ కలిగి ఉంది.

10 కోట్ల మంది మధుమేహులు

భారతదేశంలో దాదాపు 101 మిలియన్ల మంది మధుమేహ రోగులు ఉన్నారు. డయాబెటిక్ రోగులు సాధారణంగా డయాబెటిక్ డిస్ట్రెస్ అనే సమస్యతో బాధపడుతుంటారు. ఇది మధుమేహం ఉన్నవారు ఎదుర్కొనే సవాళ్లు, డిమాండ్లను ఎదుర్కోవడంలో అసమర్థత కారణంగా తీవ్రమైన భయాంధోళనలకు గురవుతారు. దానికి ప్రతిస్పందనగానే ఈ డయాబెటిక్ డిస్ట్రెస్ వస్తుంది. భారతదేశంలో, దాదాపు 42% మధుమేహ రోగులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అమెరికా డయాబెటిస్ అసోసియేషన్ (ADA) ప్రకారం, మధుమేహం ఉన్న వారందరికీ మానసిక-సామాజిక సంరక్షణ అందించాలి.

డాక్టర్ రెడ్డీస్ అవగాహన కార్యక్రమం

మధుమేహుల సమస్యలపై డాక్టర్ రెడ్డీస్ సంస్థ పలు అవగాహన కార్యక్రమాలు చేపడ్తోంది. మధుమేహం నిర్వహణలో సమగ్ర విధానం కోసం మానసిక-సామాజిక ఆరోగ్యానికి దోహదపడే అంశాలపై దృష్టి సారించేలా చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా, డయాబెటిస్ తో జీవిస్తున్న రోగులకు గ్లైసిమిక్ హ్యా పీనెస్ అనే కాన్సెప్ట్ పై డాక్టర్ రెడ్డస్ భారతదేశంలోని ప్రఖ్యాత ఎండోక్రినాలజిస్టులు, డయాబెటాలజిస్టులతో కలిసి పని చేస్తుంది. డయాబెటిస్ ఉన్న రోగులలో గ్లైసిమిక్ ఆనందాన్ని కొలవడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులకు సహ్యయపడే గ్లైసిమిక్ హ్యాపీనెస్ స్కేల్ ను కూడా డాక్టర్ రెడ్డీస్ అభివృద్ధి చేసింది. ఈ స్కేల్ లో 10 ప్రశ్నలు ఉంటాయి. వాటికి డయాబెటిస్ రోగులు ఇచ్చే సమాధానాల ఆధారంగా వారి గ్లైసిమిక్ హ్యాపీనెస్ ను కొలుస్తారు. టైప్-2 డయాబెటిస్ రోగుల గ్లైసిమిక్ ఆన్ందాన్ని కొలవడానికి “గ్లైసిమిక్ హ్యాపీనెస్ స్కేల్” ఒక ఉపయోగకరమైన సాధనం అని అందరూ అంగీకరించారు.

డయాబెటిస్ రాజధాని

డాక్ర్ట రెడ్డీస్ హెడ్-ఇండియా బిజినెస్ సందీప్ ఖండేల్వా మాట్లాడుతూ, “భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానిగా మారిందని, భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ సంరక్షణ రాజధానిగా మార్చే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. డయాబెటిస్ నిర్వహణకు సంపూర్ణ మానసిక-సామాజిక కారకాలపై శ్రద్ధ చాలా అవసరం. అందువల్ల, గ్లిమి, రక్లైడ్, రెక్టిమెట్, డాఫ్లో వంటి ఔషధాలతో కూడిన్ మా బలమైన్ మధుమేహం పోర్ట్ ఫోలియోను రూపొందించాం’’ అన్నారు.