OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 16 సినిమాలు.. చూడాల్సినవి ఐదే.. తంగలాన్, తెలుగు హారర్ వెబ్ సిరీస్ స్పెషల్-ott movies release this week on netflix amazon prime aha telugu horror web series the mystery of moksha island ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 16 సినిమాలు.. చూడాల్సినవి ఐదే.. తంగలాన్, తెలుగు హారర్ వెబ్ సిరీస్ స్పెషల్

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 16 సినిమాలు.. చూడాల్సినవి ఐదే.. తంగలాన్, తెలుగు హారర్ వెబ్ సిరీస్ స్పెషల్

Sanjiv Kumar HT Telugu
Sep 17, 2024 12:58 PM IST

OTT Movies Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వారం మొత్తంగా 16 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి రిలీజ్ కానున్నాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలతోపాటు ఒకటి హారర్ వెబ్ సిరీస్ స్పెషల్ కానుంది. వీటితోపాటు మొత్తంగా 5 వరకు ఇంట్రెస్టింగ్‌గా చూడాల్సినవి ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం.

ఓటీటీల్లో ఈ వారం 16 సినిమాలు.. చూడాల్సినవి ఐదే.. తంగలాన్, తెలుగు హారర్ వెబ్ సిరీస్ స్పెషల్
ఓటీటీల్లో ఈ వారం 16 సినిమాలు.. చూడాల్సినవి ఐదే.. తంగలాన్, తెలుగు హారర్ వెబ్ సిరీస్ స్పెషల్

This Week OTT Movies Release List: మళ్లీ కొత్త వీక్ రానే వచ్చింది. ఈ వారం థియేటర్లలో జూనియర్ ఎన్టీఆర్ దేవర భారీ మూవీ కానుంది. ఇక ఓటీటీల్లో అయితే, ఈ వారం అంటే సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు సినిమా, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 16 వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కలినరీక క్లాస్ వార్స్ (కొరియన్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 17

ది క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 19

హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 20

తంగలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- సెప్టెంబర్ 20

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో)- సెప్టెంబర్ 21

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

అన్‌ప్రీజన్డ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 16

అగాథా: హౌజ్ ఆఫ్ హార్క్‌నెస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20

తలైవేట్టాయామాపాళ్యం (తమిళ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20

ది జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 21

ఆహా ఓటీటీ

హై ఆన్ కాదల్ (తమిళ చిత్రం)- సెప్టెంబర్ 16

తిరగబడరా సామీ (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 19

మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 20

జియో సినిమా ఓటీటీ

జో తేరా హై వో మేరా హై (హిందీ సినిమా)- సెప్టెంబర్ 20

ది పెంగ్విన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 20

ఏ వెరీ రాయల్ స్కాండల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 19

మొత్తంగా 16

ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 16 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో సగం వరకు వెబ్ సిరీసులు ఉన్నాయి. ఇక వీటన్నింటిలో తెలుగు సినిమాలు అయిన రాజ్ తరుణ్ తిరగబడరా సామీ, రావు రమేష్ మారుతీనగర్ సుబ్రమణ్యంతోపాటు తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ చాలా స్పెషల్ కానున్నాయి.

చూడాల్సినవి 5

అలాగే, చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ కూడా ఈ వారం మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమా అవనుంది. ఇక ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా పదహారింట్లో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీసు, ఒక రియాలిటీ షోతో మొత్తం ఐదు మాత్రమే చూసేందుకు స్పెషల్‌ కానున్నాయి.