OTT Crime Thriller: ఓటీటీలో దూసుకుపోతోన్న అనసూయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పదిరోజులుగా ట్రెండింగ్.. రెండింట్లో స్ట్రీమింగ్-simbaa ott trending in top 6 on amazon prime and aha ott crime thriller movie simbaa starrer by anasuya bharadwaj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలో దూసుకుపోతోన్న అనసూయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పదిరోజులుగా ట్రెండింగ్.. రెండింట్లో స్ట్రీమింగ్

OTT Crime Thriller: ఓటీటీలో దూసుకుపోతోన్న అనసూయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పదిరోజులుగా ట్రెండింగ్.. రెండింట్లో స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu
Sep 17, 2024 10:59 AM IST

Simbaa OTT Streaming And Trending Top 6 Place: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సింబా ఓటీటీలో ఊహించని విధంగా దూసుకుపోతోంది. రెండు ఓటీటీల్లో గత పదిరోజులుగా ట్రెండింగ్‌ అవుతోంది. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో సింబాను తెరకెక్కించారు.

ఓటీటీలో దూసుకుపోతోన్న అనసూయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పదిరోజులుగా ట్రెండింగ్.. రెండింట్లో స్ట్రీమింగ్
ఓటీటీలో దూసుకుపోతోన్న అనసూయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పదిరోజులుగా ట్రెండింగ్.. రెండింట్లో స్ట్రీమింగ్

OTT Crime Thriller Movie Simba Trending: ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది.. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది.. అనేది రీసెంట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమై ఉంటుంది. వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత నష్టాన్ని చవి చూశాయో అందరికీ తెలిసిందే.

కొత్త దర్శకుడు పరిచయం

ప్రకృతిని కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది.. చెట్లను పెంచి.. చెరువుల్ని కబ్జాలు చేయకుండా ఉంటే.. ఇలాంటి ప్రకృతి విళయతాండవాలు జరగవు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తీశారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సింబా. ఈ సినిమాతో మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు.

థియేటర్లలో రాని రెస్పాన్స్

సింబా చిత్రంలో అనసూయ భరద్వాజ్, సీనియర్ హీరో జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రశంసలు వస్తాయి. కానీ, థియేటర్లో ఆడియెన్స్‌ నుంచి అంతగా రెస్పాన్స్ రాదనే విషయం తెలిసిందే.

క్రైమ్ థ్రిల్లర్ జానర్

అయితే, ఇలాంటి చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేస్తే మాత్రం టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. ఇదే కోవలోకి తాజాగా సింబా మూవీ కూడా వచ్చేసి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ అండ్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సింబా సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

టాప్ 6లో ట్రెండింగ్

అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6 స్థానంలో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది. ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయి. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు.

డైరెక్టర్ మేకింగ్‌కు

డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారు. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ ‌కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది.

8.9 ఐఎమ్‌డీబీ రేటింగ్

అంతేకాకుండా సింబా సినిమాకు ఐఎమ్‌డీబీ పదికి ఏకంగా 8.9 రేటింగ్ ఇవ్వడం విశేషంగా మారింది. దీంతో సింబా మూవీపై ఆదరణ మరింతగా పెరుగుతోంది. అందుకే సింబా చిత్రాన్ని ఓటీటీల్లో చూసేందుకు తెలుగు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫలితంగా టాప్ 6లో ఓటీటీలో ఊహించని విధంగా సింబా ట్రెండింగ్ అవుతోంది.