OTT Series In September: సెప్టెంబర్‌లో ఓటీటీలోకి రానున్న 5 వెబ్ సిరీసులు.. క్రైమ్ థ్రిల్లర్ టు రొమాన్స్ వరకు.. ఎక్కడంటే?
New K Drama Web Series OTT Release In September: ఓటీటీ ప్రియులను అలరించేందుకు సెప్టెంబర్‌లో అదిరిపోయే కొరియన్ డ్రామా వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రొమాంటిక్ జోనర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ వరకు ఉన్నాయి. మరి ఈ సెప్టెంబర్ కొరియన్ ఓటీటీ సిరీసులు ఎక్కడ రిలీజ్ కానున్నాయంటే..
OTT Web Series In September: కొరియన్ డ్రామా సిరీస్‌లకు వరల్డ్ వైడ్‌గా చాలా క్రేజ్ ఉంటుంది. ఈ డ్రామా వెబ్ సిరీసులను చూసేందుకు ఓటీటీ ప్రియులు తెగ ఉవ్విల్లూరుతుంటారు. అలాంటి వారి కోసం సెప్టెంబర్ నెలలో థ్రిల్లింగ్ వినోదం పంచేందుకు సరికొత్త కే డ్రామా సిరీసులు రానున్నాయి. అలాగే ఓటీటీ అభిమానులను అలరించడానికి రిఫ్రెషింగ్‌గా ఉండే కె-డ్రామాల్లో మనసును కదిలించే థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ జానర్స్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
సియోల్ బస్టర్స్ ఓటీటీ
క్రైమ్ కామెడీ జోనర్స్‌లో వస్తోన్న కొరియన్ వెబ్ సిరీస్ సియోల్ బస్టర్స్. దేశంలోని అట్టడుగు స్థాయి పోలీసు దళానికి సంబంధించిన కథాంశంతో ఇది సాగుతుంది. అతి చెత్త అరెస్ట్ రికార్డ్ ఉన్న ఈ టీమ్ ఓ పాపులర్ మర్డర్ మిస్టరీ ఛేదించాల్సి వస్తుంది. క్రైమ్, కామెడీ మేళవింపుతో ఈ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ది జడ్జ్ ప్రమ్ హెల్ ఓటీటీ
అధికార దాహం ఉన్న మహిళా జడ్జి, ప్యాషన్ ఉన్న డిటెక్టివ్ కలిసి న్యాయం కోసం పోరాటం చేసే కథాంశంతో ఈ ది జడ్జ్ ఫ్రమ్ హెల్ సిరీస్ ఉంటుంది. కాంగ్ బిట్నా అనే రాక్షసుడు భూమ్మీద తప్పు చేసిన వారిని శిక్షించి వారిని నరకం అనే అగ్నికి ఆహుతిస్తాడు. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 21న ఓటీటీ రిలీజ్ కానుంది.
టు మై హైరీ ఓటీటీ
సినీ రంగంలో మంచి ఫేమ్ కోసం 13 సంవత్సరాలు కష్టపడిన ఓ యువతి చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. కానీ, ఆమె మాజీ ప్రేమికుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడం, ఎమోషనల్ సీన్స్‌తో థ్రిల్లింగ్ డ్రామాతో టు మై హైరీ సాగతుంది. ఇది జెనీ టీవీలో సెప్టెంబర్ 23 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
వాట్ కమ్స్ ఆఫ్టర్ లవ్ ఓటీటీ
చోయ్ హాంగ్ అనే కొరియన్ విద్యార్థి జపాన్‌లో చదువుకుంటున్న సమయంలో అవోకి జుంగోతో ప్రేమలో పడతాడు. అయితే చివరకు ఇద్దరూ విడిపోయి ఐదేళ్ల తర్వాత మళ్లీ కొరియాలో తారసపడతారు మరి వీరిద్దరూ మళ్లీ ఒక్కటవుతారా లేక ఇంతటితో ముగుస్తుందా అనే ప్రశ్నతో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా వాట్ కమ్స్ ఆఫ్టర్ లవ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ రొమాంటిక్, మెలో డ్రామా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
ఐరన్ ఫ్యామిలీ ఓటీటీ
మిస్టరీ, కామెడీ, రొమాన్స్, డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఐరన్ ఫ్యామిలీ. నేటి సమాజాంలో కుటుంబాలు ఎలా ఉంటాయో వాటికి అద్దం పట్టేలా ఈ సిరీస్ రూపొందించినట్లు సమాచారం. ఊహించని ఆర్థిక సంక్షోభం వారి జీవితాలను అతలాకుతలం చేసినప్పుడు మూడు తరాలుగా లాండ్రీ వ్యాపారం చేసే ఆ కుటుంబం ఎదుర్కొనే ఒడిదుడుకుల చుట్టూ సాగుతుంది. ఊహించని మలుపులతో సాగే ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.