OTT Top Movie: ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోన్న తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి?-telugu crime comedy movie gam gam ganesha ott top 3 trending on amazon prime anand deverakonda gam gam ganesha ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top Movie: ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోన్న తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి?

OTT Top Movie: ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోన్న తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి?

Sanjiv Kumar HT Telugu
Jun 22, 2024 01:11 PM IST

Gam Gam Ganesha OTT Streaming Now: తెలుగు క్రైమ్ కామెడీ మూవీగా వచ్చిన గం గం గణేశా సినిమా ఓటీటీలో టాప్ ప్లేసులో దూసుకుపోతోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే..

ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోన్న తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి?
ఓటీటీలో టాప్‌లో దూసుకుపోతోన్న తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి?

Gam Gam Ganesha OTT Release: క్రైమ్ కామెడీ జోనర్‌లో వచ్చే సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకీ ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్ సినిమాలు బాగా రన్ అవుతుంటాయి. అందులోనూ తెలుగులో వచ్చే క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. థియేటర్లలో రిజల్ట్ ఎలా ఉన్నా ఓటీటీలో మాత్రం సత్తా చాటుతూ దూసుకుపోతుంటాయి.

అలాగే ప్రస్తుతం కూడా ఓ తెలుగు క్రైమ్ కామెడీ సినిమా ఓటీటీలో టాప్ ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. అది విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా సినిమా. ఈ లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే ఆయన టాలీవుడ్‌లోకి దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆయనతోపాటు నిర్మాతగా డెబ్యూ ఇచ్చారు ప్రొడ్యూసర్ వంశీ కారుమంచి.

హైలైఫ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి గం గం గణేశా సినిమాను వంశీ కారుమంచి నిర్మించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా వచ్చిన ఈ చిత్రం మే 31న గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్ అయింది. థియేటర్లలో ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమందికి సినిమా నచ్చితే మరికొంతమంది రొటీన్‌గా ఫీల్ అయ్యారు.

స్టోరీ పాతదైనా డైరెక్టర్ టేకింగ్, ఆనంద్ దేవరకొండ నటన, కామెడీ టైమింగ్ బాగుందని మెచ్చుకున్నారు. అలాగే సినిమాలో వచ్చే ట్విస్టులు సైతం అదిరిపోయాయని చెప్పారు. అక్కడక్కడ స్లో నెరేషన్, సెకండాఫ్‌లో కథ స్లోగా రన్ అవడం మరికొంతమందికి నచ్చలేదు. ఇలాంటి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న గం గం గణేశా సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా జూన్ 20న సడెన్‌గా ఓటీటీలో దర్శనం ఇచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న గం గం గణేశా మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఓటీటీ రిలీజ్ డేట్ నుంచి ఈ చిత్రానికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి. దాంతో సినిమా ఓటీటీ ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ టాప్ 10 సినిమాల్లో టాప్ 3 స్థానం దక్కించుకుని సత్తా చాటుతుంది గం గం గణేశా మూవీ.

ఇక టాప్ 1 స్థానంలో మోస్ట్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3 ఉంటే.. రెండో ప్లేసులో హాలీవుడ్ సూపర్ హీరో వెబ్ సిరీస్ ది బాయ్స్ సీజన్ 3 నిలిచింది. బాలీవుడ్, హాలీవుడ్ వెబ్ సిరీసుల తర్వాత మూడో స్థానాన్ని తెలుగు క్రైమ్ కామెడీ సినిమా అయినా గం గం గణేశా దక్కించుకుంది. అంతేకాకుండా తెలుగు నుంచి చూసుకుంటే ఈ మూవీనే అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 1 సినిమాగా చెప్పుకొవచ్చు.

ఇదిలా ఉంటే, గం గం గణేశా చిత్రంలో ఆనంద్ దేవరకొండకు జోడీగా నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్‌గా చేశారు. వీరితోపాటు జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్, బిగ్ బాస్ ప్రిన్స్ యావర్, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ఆనంద్ దేవరకొండ-ఇమ్మాన్యూయెల్ కామెడీ ట్రాక్ చాలా బాగుందని కామెంట్స్ వచ్చాయి. అలాగే వెన్నెల కిశోర్ కూడా తనదైన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారట.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 3 ట్రెండింగ్‌లో గం గం గణేశా సినిమా
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 3 ట్రెండింగ్‌లో గం గం గణేశా సినిమా
WhatsApp channel