Harish Shankar: అనన్య నాగళ్లతో వెన్నెల కిశోర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ మూవీ.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సపోర్ట్-director harish shankar launch srikakulam sherlock holmes title song maa ooru srikakulam vennela kishore ananya nagalla ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harish Shankar: అనన్య నాగళ్లతో వెన్నెల కిశోర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ మూవీ.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సపోర్ట్

Harish Shankar: అనన్య నాగళ్లతో వెన్నెల కిశోర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ మూవీ.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సపోర్ట్

Sanjiv Kumar HT Telugu
Jun 22, 2024 12:13 PM IST

Harish Shankar Srikakulam Sherlock Holmes Title Song: వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల, కమెడియన్ వెన్నెల కిశోర్ హీరో హీరోయిన్లుగా చేస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ సినిమా నుంచి మా ఊరు శ్రీకాకుళం అనే టైటిల్ సాంగ్‌ను లాంచ్ చేశారు డైరెక్టర్ హరీశ్ శంకర్.

అనన్య నాగళ్లతో వెన్నెల కిశోర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ మూవీ.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సపోర్ట్
అనన్య నాగళ్లతో వెన్నెల కిశోర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ మూవీ.. డైరెక్టర్ హరీశ్ శంకర్ సపోర్ట్

Harish Shankar Vennela Kishore Ananya Nagalla: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు సినిమాకు రచయితగా పని చేసిన రైటర్ మోహన్ ఈ మూవీతో దర్శకుడిగా మారారు.

మా ఊరు శ్రీకాకుళం టైటిల్ సాంగ్

శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ షెర్లాక్ హోమ్స్ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'మా ఊరు శ్రీకాకుళం' టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసి సపోర్ట్‌గా నిలిచారు.

మంగ్లీ ఎనర్జిటిక్ వోకల్స్

సునీల్ కశ్యప్ ఈ సాంగ్‌ను క్యాచి అండ్ టచ్చింగ్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. శ్రీకాకుళం గురించి సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి.

డిఫరెంట్ సినిమా

మా ఊరు శ్రీకాకుళం సాంగ్ లాంచింగ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ సాంగ్ లాంచ్ చేయడం చాలా అనందంగా ఉంది. టైటిల్ చాలా ఫన్నీగా ఉంది. మోహన్ నాకు రైటర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం. చాలా మంచి రైటర్. సాంగ్ చూశాను. మంగ్లీ అద్భుతంగా పాడింది. విజువల్స్ కూడా చాలా బావున్నాయి. వెన్నెల కిషోర్ గారి నుంచి ఒక డిఫరెంట్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్"అని తెలిపారు.

టెక్నిషీయన్స్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రానికి ప్రముఖ సాంకేతిక న నిపుణులు పని చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. మల్లికార్జున్ ఎన్ డీవోపీ గా, అవినాష్ గుర్లింక ఎడిటర్‌గా పని చేస్తున్నారు. బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. రాజేష్ రామ్ బాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలు చేపట్టారు.

నటీనటులు

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్లతోపాటు, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహాద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయ్ ఐడ్రీం నాగరాజు, ఎంవీఎన్ కశ్యప్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌తో

కాగా, తన కామెడీ టైమింగ్‌తో ఇన్నాళ్లు అలరించిన కమెడియన్ వెన్నెల కిశోర్ ఈ మధ్యే హీరోగా చేస్తున్నాడు. కామెడీ స్పై, యాక్షన్, థ్రిల్లర్ ఇలా వివిధ జోనర్లలో తనదైన మార్క్ కామెడీతోపాటు హీరోయిజం చూపిస్తున్నాడు. ఇటీవలే చారి 111 సినిమాతో అలరించాడు. స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది.

జోడీగా అనన్య నాగళ్ల

ఇప్పుడు డిటెక్టివ్ పాత్రలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌గా క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా వెన్నెల కిశోర్ సినిమా రానుంది. ఇందులో ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవలే తంత్ర సినిమాతో ప్రేక్షకులను భయపెట్టిన అనన్య నాగళ్ల పొట్టేల్ అనే మరో సినిమా కూడా చేస్తోంది.

WhatsApp channel