Anveshi Movie: తెలుగులో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్.. అనన్య నాగళ్ల 'అన్వేషి' రిలీజ్ ఎప్పుడంటే?-ananya nagalla anveshi movie released on november 10 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anveshi Movie: తెలుగులో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్.. అనన్య నాగళ్ల 'అన్వేషి' రిలీజ్ ఎప్పుడంటే?

Anveshi Movie: తెలుగులో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్.. అనన్య నాగళ్ల 'అన్వేషి' రిలీజ్ ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
Oct 01, 2023 09:04 AM IST

Anveshi Movie Release Date: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్‌గా సాగే సినిమాలను మూవీ లవర్స్ ఇష్టపడుతుంటారు. అందుకే తెలుగులో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్వేషి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనన్య నాగళ్ల అన్వేషి మూవీ విడుదల తేది
అనన్య నాగళ్ల అన్వేషి మూవీ విడుదల తేది

Ananya Nagalla Anveshi Movie: వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్వేషి. అనన్య నాగళ్లతోపాటు మరో హీరోయిన్‌గా సిమ్రాన్ గుప్తా చేస్తోంది. హీరోగా విజయ్ ధరణ్ దాట్ల చేశాడు. అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై టి. గణపతి రెడ్డి నిర్మించిన అన్వేషి సినిమాకు వీజే ఖ‌న్నా ద‌ర్శ‌క‌త్వం వహించారు. అన్వేషి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్.

"నిర్మాత‌గా అన్వేషి నా తొలి చిత్రం. మా డైరెక్టర్ వీజే ఖన్నా మంచి క‌థ‌, స్క్రీన్‌ప్లేతో మంచి సినిమా చేశారు. షూటింగ్ అంతా పూర్త‌య్యింది. న‌వంబ‌ర్ 10న గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేశాం. హీరో విజ‌య్‌, హీరోయిన్స్ సిమ్రాన్, అనన్య నాగళ్ల అద్భుతంగా న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రికొన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం, కెకె రావు సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆకట్టుకుంటాయి" అని నిర్మాత గణపతి రెడ్డి తెలిపారు.

"మా అన్వేషి సినిమా కథపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత గ‌ణ‌ప‌తి రెడ్డి గారికి థాంక్స్‌. అలాగే స‌హ నిర్మాత‌లు అంద‌రూ నాకెంతో స‌పోర్ట్‌గా నిలిచారు. హీరో విజ‌య్ ధ‌ర‌ణ్‌, సిమ్రాన్ గుప్తాలు చ‌క్క‌గా న‌టించారు. అన‌న్య నాగ‌ళ్ల ఈ సినిమాలో కీ పాత్ర‌లో న‌టించారు. ఆమె చుట్టూనే క‌థ తిరుగుతుంటుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే సినిమా. చైత‌న్ భ‌రద్వాజ్ ఎంత ఎఫ‌ర్ట్ పెట్టారో నాకు తెలుసు. నవంబర్ 10న మీ ముందుకు వస్తున్నాం" అని డైరెక్టర్ వీజే ఖన్నా పేర్కొన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024