OTT Family Thriller: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన సరికొత్త ఫ్యామిలీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
PT Sir OTT Streaming: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్హాప్ తమిళ హీరోగా నటించిన సినిమా పీటీ సర్. మే 24న తమిళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ పీటీ సర్ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..
PT Sir OTT Release: ఓటీటీల్లో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో సినిమాలు విడుదల అవుతుంటాయనే విషయం తెలిసిందే. అయితే, ఎక్కువగా ప్రేక్షకులు హారర్, క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ, ఫాంటసీ, యాక్షన్ చిత్రాలనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. మంచి స్క్రీన్ ప్లేతో వచ్చే ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమాలపై ఎక్కువ దృష్టి ఉండదు. అందుకే డ్రామాటిక్‌గా ఉండే ఈ సినిమాలు రావడం చాలా అరుదు.
అలాంటి ఓ ఫ్యామిలీ డ్రామా సినిమానే పీటీ సర్. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్హాప్ తమిళ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ అందించి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా హీరోగా, నటుడిగా పలు సినిమాలతో అలరించాడు హిప్హామ్ తమిళ. ఇటీవల హిప్హామ్ తమిళ హీరోగా నటించిన పీటీ సర్ సినిమా మే 24న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
కానీ, ఐఎమ్‌డీబీ సంస్థ మాత్రం పీటీ సర్ సినిమాకు ఏకంగా 10కి 7.6 రేటింగ్ ఇచ్చింది. దీంతో ఈ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే, ఈ సినిమా సడెన్‌గా ఇవాళ (జూన్ 21) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో పీటీ సర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం తమిళంలోనే అందుబాటులో ఉంది. భాషతో సంబంధం లేదనుకునేవాళ్లు ఈ ఫ్యామిలీ డ్రామాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తమిళంలో వీక్షించవచ్చు.
ఓటీటీలో పీటీ సర్ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఇతర భాషల్లో అంటే తెలుగు, తదితర సౌత్ లాంగ్వేజెస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రానికి కార్తీక్ వేణుగోపాలన్ రచన, దర్శకత్వంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాకు హీరో అయిన హిప్హాప్ తమిళనే సంగీతం అందించిడం విశేషం.
ఈ చిత్రంలో ఒక పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్‌గా హీరో మారుతాడు. ఈ క్రమంలో స్కూల్లో ఓ అమ్మాయికి జరిగిన అన్యాయానికి పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. మరి ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? ఈ క్రమంలో పీటీ సర్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ? అనే ఆసక్తకర అంశాలు తెలియాలంటే ఈ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.
కాగా ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ వేణుగోపాలన్ 2019లో వచ్చిన కామెడీ మూవీ నెంజముండు నెర్మైయుండు ఓడు రాజాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా తర్వాత కార్తీక్ వేణుగోపాలన్ దర్శకుడిగా తెరకెక్కించిన రెండో సినిమానే పీటీ సర్. ఈ సినిమాలో హిప్హాప్ తమిళకు జోడీగా హీరోయిన్ కాశ్మీరా పరదేశి నటించింది. అలాగే స్కూల్ విద్యార్థిగా అనిఖా సురేంద్రన్ చేసింది.
వీరితోపాటు పీటీ సర్ సినిమాలో ప్రభు, కె భాగ్యరాజ్, పాండియరాజన్, మునిష్కాంత్, త్యాగరాజన్, ఇళవరసు, దేవదర్శిని, పట్టిమండ్రం రాజా, వినోదిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మాధేష్ మాణికం సినిమాటోగ్రాఫర్‌గా, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈసరి కె గణేష్ నిర్మించారు.
ఇక పీటీ సర్ సినిమా రెండు గంటల 10 నిమిషాల నిడివితో ఉండి సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. కాబట్టి, సుమారు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమాను పిల్లలు, పెద్దవాళ్లు, ఫ్యామిలీతో కలిసి చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.