Butta Bomma Trailer : అనిఖా సురేంద్రన్ 'బుట్టబొమ్మ' ట్రైలర్ విడుదల
Butta Bomma Trailer Release : అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన బుట్టబొమ్మ ట్రైలర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీలా ఉండనున్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

బుట్టుబొమ్మ ట్రైలర్(Butta Bomma Trailer)ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేశాడు. అరకు బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమకథ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్(Anikha Surendran) టైటిల్.. రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది.
ఆటోడ్రైవర్ పాత్రలో సూర్యవశిష్ఠ కనిపిస్తున్నాడు. కాలేజీ యువతి పాత్రలో అనిఖా సురేంద్రన్ ఉండనుంది. ఈ ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ నడుస్తుంటే.. అర్జున్ దాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేలా.. ట్రైలర్ కట్ చేశారు. బుట్టబొమ్మ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ U/A సర్జిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన బుట్టబొమ్మ టీజర్(Butta Bomma Teaser) సినిమాపై ఆసక్తిని పెంచింది.
సితారా ఎంటర్ టైన్ మెంట్స్(sithara entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 26వ తేదీన సినిమా విడుదల కావాల్సింది. అయితే విడుదలలో జాప్యం జరిగింది. ఫిబ్రవరి 4న సినిమా విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీ మారిందని, అయితే ఎదురుచూపులకు తగిన విధంగానే సినిమా ఉంటోందని చిత్రబృందం అంటోంది.
బుట్టబొమ్మను ఫిబ్రవరి 4న ప్లాన్ చేశారు. ఫిబ్రవరి మూడో తేదీన సందీప్ కిషన్ మైఖేల్(sundeep kishan michael) తోపాటుగా సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్(writer padmabhushan) విడుదల కానున్నాయి. దీంతో ఫిబ్రవరి 4వ తేదీన బుట్టబొమ్మ వీటితో పోటీ పడనుంది. ఈ సినిమాలో నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, 'కంచెరపాలెం' కిషోర్ తదితరులు నటించారు. సినిమాలో లీడ్ రోల్ లో నటించిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.