Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-telugu crime thriller bhaje vaayu vegam ott streaming on netflix ott movies kartikeya gummakonda iswarya menon ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhaje Vaayu Vegam Ott: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhaje Vaayu Vegam OTT: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

Bhaje Vaayu Vegam OTT Streaming: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ భజే వాయు వేగం ఓటీటీలోకి వచ్చేయనుంది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదల కాగా డీసెంట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో భజే వాయు వేగం సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్, ఓటీటీ రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారాయి.

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bhaje Vaayu Vegam OTT Release: ఆర్ఎక్స్ 100 వంటి తొలి సినిమాతో హీరోగా సూపర్ క్రేజ్ అందుకున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత అంతటి రేంజ్‌లో ఆయన సినిమాలు రాలేదు, ఆడలేదు. కానీ, అంతకుమించిన హిట్ కొట్టాలన్న తాపత్రయంతో వరుసపెట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు హీరో కార్తికేయ గుమ్మకొండ.

ఇటీవల బెదురులంక 2012 సినిమాతో యావరేజ్ టాక్ తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్ మూవీనే భజే వాయు వేగం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవితో విడుదల చేయించి ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు.

అయితే భజే వాయు వేగం సినిమా టీజర్, గ్లింప్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్‌తోపాటు ఫాదర్ సెంటిమెంట్ ఉన్నట్లుగా సినిమా ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతోంది. ఇక మంచి అంచనాలతో మే 31న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది భజే వాయు వేగం మూవీ. రిలీజైనప్పటి నుంచి సినిమాకు మంచి డీసెంట్ టాక్ వస్తోంది.

మంచి రెస్పాన్స్‌తో ప్రేక్షకుల ఆదరణ అందుకుంటోంది భజే వాయు వేగం సినిమా. అలాగే కార్తికేయ గుమ్మకొండ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఉత్కంఠత కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా బాగుందని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ చివరి 20 నిమిషాల్లో వరుసగా వచ్చే ట్విస్టులు బాగా ఆకట్టకున్నాయని పలువురు రివ్యూలు ఇచ్చారు.

మంచి క్రేజ్ తెచ్చుకుంటోన్న భజే వాయు వేగం సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను మంచి ధర పెట్టి దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేది వివరాలు సైతం లీక్ అయ్యాయి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై థియేట్రికల్ విడుదల కంటే ఫిక్స్ అయినట్లు సమాచారం.

భజే వాయు వేగం సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజులకు స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అంటే ఈ నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేయనుందని క్లియర్‌గా తెలిసిపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలు సైతం 20 నుంచి నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డీసెంట్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా కూడా నెలలోపే ఓటీటీలోకి రానుందని సమాచారం.

జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై మొదటి వారంలో భజే వాయు వేగం ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇదిలా ఉంటే, భజే వాయు వేగం సినిమాను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో కార్తికేయకు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించాడు.

వీరితోపాటు భజే వాయు వేగం సినిమాలో తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు కపిల్ కుమార్ సంగీతం అందించారు.