OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 4 మాత్రం మిస్ కావొద్దు.. ఎక్కడ చూడాలంటే?-ott movies released on this friday aranmanai 4 ott streaming bad cop ott hindi bigg boss ott season 3 new ott releases ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 4 మాత్రం మిస్ కావొద్దు.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 4 మాత్రం మిస్ కావొద్దు.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu

New OTT Releases Friday: ఈ వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని మొత్తంగా 22కుపైగా విడుదల అయ్యాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజే అంటే జూన్ 21న 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ.. వాటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ 4 మాత్రం మిస్ కావొద్దు.. ఎక్కడ చూడాలంటే?

Today OTT Releases: ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వెబ్ సిరీసులు ఓటీటీలో దర్శనం ఇస్తూ సినీ లవర్స్‌ను కవ్విస్తుంటాయి. ఒక లిస్ట్‌లోని సినిమాలు చూడటం పూర్తి కాకముందే ఇంట్రెస్టింగ్ కలిగేలా మరికొన్ని చిత్రాలు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి నెలకొనగా.. ఓటీటీలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలు అలరించడానికి రెడీగా ఉన్నాయి.

ప్రతి వారం ఓటీటీలో సినీ పండుగ జరిగినా అది ఎక్కువగా ఫ్రైడే మాత్రమే ఉంటుంది. ఈ ఒక్కరోజే కుప్పలుతెప్పలుగా సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఈ శుక్రవారం కూడా (Friday OTT Release) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 11 వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ వెబ్ సిరీస్)- జూన్ 21

నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 21

ది విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ వెబ్ సిరీస్)- జూన్ 21

ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 21

ది యాక్సిడెంటల్ ట్విన్స్ (స్పానిష్ చిత్రం)- ఆల్రెడీ స్ట్రీమింగ్

రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ వెబ్ సిరీస్)- జూన్ 22

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

బాక్ (తమిళంలో అరణ్మనై 4-తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 21

బ్యాడ్ కాప్ (హిందీ వెబ్ సిరీస్)- జూన్ 21

ది బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 21

మై నేమ్ ఈజ్ గాబ్రియల్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 21

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 (హిందీ రియాలిటీ షో)- జియో సినిమా ఓటీటీ- జూన్ 21

రసవతి (తమిళ సినిమా) -ఆహా ఓటీటీ- జూన్ 21

లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ చిత్రం)- బుక్ మై షో- జూన్ 21

హారర్ అండ్ క్రైమ్

ఇలా ఇవాళ ఒక్కరోజే (జూన్ 21) ఓటీటీలోకి 11 సినిమాలు వచ్చాయి. వీటన్నింటిలో తమన్నా, రాశీ ఖన్నా గ్రామర్‌తో రచ్చ చేసిన హారర్ కామెడీ సినిమా అరణ్మనై 4 (బాక్ మూవీ), తెలుగు డబ్బింగ్ సినిమా నడికర్ తిలకం, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్యాడ్ కాప్ మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీటితోపాటు ప్రముఖ రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 కూడా మరింత స్పెషల్ కానుంది.

4 ఇంట్రెస్టింగ్

ఈ నాలుగు ఇంట్రెస్టింగ్ సినిమాలు, రియాలిటీ షోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో కోటా ఫ్యాక్టరీ సీజన్ హిందీ సిరీస్, అమెరికన్ స్వీట్ హార్ట్స్, అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రెంచ్ మూవీ లెస్ అన్ఫైలబుల్స్, ఇంగ్లీష్ చిత్రం ఫెదరర్ ట్వెల్వ్ ఫైనల్ డేస్ ఇదివరకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ చాలా పాపులర్.

థియేట్రికల్ సినిమాలు

ఇదిలా ఉంటే, ఇవాళ థియేటర్లలో చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. వరుణ్ సందేశ్ నింద, చైతన్య రావు-హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్, వెన్నెల కిశోర్-నందితా శ్వేత ఓ మంచి ఘోస్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సీతా కల్యాణ వైభోగమే, అంతిమ తీర్పు, సందేశం, మరణం, సై అంటే సై విడుదల కానున్నాయి.