OTT Series: ఓటీటీలో ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ ఇచ్చిన బెస్ట్ 5 వెబ్ సిరీసులు.. అన్ని ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్
IMDB Top Rated OTT Web Series: ఓటీటీలో ఇటీవల వచ్చిన వెబ్ సిరీసులు ఐమ్‌డీబీ నుంచి మంచి రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. వాటిలో టాప్ 5 బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీసులను, వాటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాల్లోకి వెళితే..
IMDB Top Rated OTT Web Series: మీరు ఈ వారం ఓటీటీలో ఏమి చూడాలని ఆలోచిస్తుంటే.. మీకు నెట్ ఫ్లిక్స్ బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఈ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో చాలా షోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. భారతదేశంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ ఓటీటీలోని టాప్ 5 టాప్ రేటెడ్ ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న షోలు, వెబ్ సిరీసుల గురించి తెలుసుకుందాం. అయితే, ఈ వారం టాప్ షోలలో కొన్ని ఇండియన్ టీవీ షోలతో పాటు అమెరికన్, కొరియన్ షోలు సైతం ఉన్నాయి.
క్వీన్ ఆఫ్ టియర్స్ ఓటీటీ
ఐమ్‌డీబీ ఇచ్చి రేటింగ్‌లో మొదటి స్థానంలో కొరియన్ వెబ్ సిరీస్ క్వీన్ ఆఫ్ టియర్స్ ఉంది. ఇది భావోద్వేగం, డ్రామా వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఈ సిరీస్ ఐఎండీబిలో 10 కి 8.5 రేటింగ్ కలిగి ఉంది. కాబట్టి మంచి కొరియన్ డ్రామా షోలను ఇష్టపడేవారికి క్వీన్ ఆఫ్ టియర్స్ చాలా బెస్ట్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది.
మామ్‌ల లీగల్ హై ఓటీటీ
భోజ్‌పురి పాపులర్ నటుడు రవి కిషన్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మామ్‌ల లీగల్ హై. కామెడీ తరహాలో కోర్ట్ రూమ్ డ్రామాను చూడాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ సిరీస్ ఎండీబీ రేటింగ్‌లో 10కి 8.1 రేటింగ్ సాధించింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌కు ఇచ్చిన టాప్ 5 సిరీసుల్లో దీనికి రెండో స్థానం దక్కింది. ఇక రవి కిషన్ రేసుగుర్రం సినిమాతో చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
త్రీ బాడీ ప్రాబ్లమ్స్ ఓటీటీ
సైన్స్ ఫిక్షన్ టీవీ షోగా పేరు తెచ్చుకుంది. '3 బాడీ ప్రాబ్లమ్స్' జాబితాలో అత్యధిక రేటింగ్‌తో ట్రెండింగ్‌లో ఉంది ఈ వెబ్ సిరీస్. ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ షోకు ఇండియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే 'టాప్ 5' టీవీ షోల జాబితాలో మూడో స్థానంలో ఉంది ఈ సిరీస్. ఐఎండీబీలో ఈ షోకు 10కి 8 రేటింగ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను గేమ్ ఆఫ్ థ్రోన్స్ మేకర్స్ రూపొందించారు.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో
బాలీవుడ్‌లో పాపులర్ కమెడియన్‌గా పేరు సంపాదించుకున్నాడు 'కామెడీ కింగ్' కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్. ఈ టాప్ సెలబ్రిటీల గెస్ట్ షోనే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'. కామెడీ షో ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్‌లో నాలుగో స్థానంలో ఉంది.
ఈ కామెడీ షోకు ఐఎమ్‌డీబీ సంస్థ 10కి 6.9 రేటింగ్ ఇచ్చింది. కపిల్ శర్మ, రణ్ బీర్ కపూర్‌లతో చేసిన మొదటి ఎపిసోడ్‌కు చాలా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ప్రతి కొత్త ఎపిసోడ్‌తో ఈ షోకు జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix OTT) ప్రసారం అవుతోంది.
టెస్టమెంట్: ది స్టోరీ ఆఫ్ మోసెస్
'టాప్ 5' షోల జాబితాలో టాప్ 5 స్థానంలో 'టెస్టమెంట్: ది స్టోరీ ఆఫ్ మోసెస్' వెబ్ సిరీస్ నిలిచింది. దీనికి ఐఎండిబిలో 10కి 6.6 రేటింగ్ కలిగి ఉంది. ఇజ్రాయెల్ యువరాజు కథకు సంబంధించి నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది.
టాపిక్