Rebel Moon Review: రెబల్ మూన్ రివ్యూ.. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?-rebel moon movie review and rating in telugu zack snyder rebel moon a child of fire review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rebel Moon Review: రెబల్ మూన్ రివ్యూ.. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Rebel Moon Review: రెబల్ మూన్ రివ్యూ.. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 01, 2024 07:24 AM IST

Rebel Moon A Child Of Fire Review Telugu: హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన నెట్ ఫ్లిక్స్ ఓటీటీ మూవీ రెబల్ మూన్: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రెబల్ మూన్ రివ్యూలో తెలుసుకుందాం.

రెబల్ మూన్ రివ్యూ.. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో స్కై ఫై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
రెబల్ మూన్ రివ్యూ.. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో స్కై ఫై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Rebel Moon Review In Telugu: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో జాక్ స్నైడర్ ఒకరు. ఆయన తన డిఫరెంట్ టేకింగ్‌తో వరల్డ్ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నారు. 300, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్‌మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టీస్ లీగ్, డాన్ ఆఫ్ ది డెడ్ వంటి ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. అలానే ఇటీవల వచ్చిన రెబల్ మూన్: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ సినిమాపై కూడా భారీ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.

ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది రెబల్ మూన్ మూవీ. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రెబల్ మూన్ సినిమాలో సోఫియా బౌటెల్ల, ఎడ్ స్క్రీన్, మైఖేల్ హ్యూస్‌మన్, చార్లీ హున్నామ్, షార్లెట్ మాగీ, స్టాజ్ నాయర్, బే డూనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాలతో జాక్ స్నైడర్ మూవీగా వచ్చిన ఈ స్కై ఫి యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో రెబల్ మూన్ రివ్యూలో తెలుసుకుందాం

కథ:

చంద్రుడికి దూరంగా ఒక మదర్ వరల్డ్ అనే ప్రపంచం ఉంటుంది. ఆ మదర్ వరల్డ్‌కు తెలీకుండా వ్యవసాయం చేస్తూ ప్రశాంతంగా జీవనం సాగించే రైతుల గ్రామం ఉంటుంది. అక్కడ నేల సారవంతంగా ఉండటంతో పంటలు బాగా పండుతాయి. మరోవైపు మదర్ వరల్డ్‌ను అట్టికస్ నోబుల్ (ఎడ్ స్క్రీన్) అనే రక్షణ అధికారి పరిపాలిస్తుంటాడు. తన నియంతృత అధికారంతో మదర్ వరల్డ్‌ బయట ఉన్న గ్రామాలను, గ్రహాలను రక్తపాతంతో నింపేస్తాడు. ప్రజలను కిరాతకంగా చంపడం అతని నైజం.

అలాంటి నోబుల్‌కు రైతుల గ్రామం, పంటలు గురించి తెలుస్తుంది. అక్కడి ధాన్యాన్ని తనకు ఇవ్వాల్సిందిగా ఆ గ్రామ పెద్ద సిండ్రీ (కోరీ స్టోల్)ని కోరుతాడు. కానీ నోబుల్ గురించి తెలిసిన సిండ్రీ తనకు సహాయం చేసేందుకు సిద్ధంగా లేమని చెబుతాడు. దాంతో ఆ ఊరి జనం ముందు సిండ్రిని చంపేస్తాడు నోబుల్. అనంతరం అక్కడే నోబుల్ సైన్యం నివాసం ఉంటుంది. దాంతో నోబుల్‌పై అతని సైన్యంపై తిరుగుబాడు చేయాలని అదే గ్రామంలో ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా జీవిస్తున్న కోరా (సోఫియా బౌటెల్ల) అనుకుంటుంది.

హైలెట్స్

నోబుల్‌పై కోరా ఎలా తిరుగుబాటు చేయాలనుకుంది? అందుకోసం ఎవరి సహాయం తీసుకుంది? ఇంతకుముందు తిరుగుబాటు చేసిన వీరులను ఎలా కలుసుకుంది? అసలు కోరా గతం, అసలు పేరు ఏంటీ? ఆమె ఏ ప్రాంతానికి చెందింది? కోరాకు, నోబుల్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటీ? నోబుల్‌ను కోరా ఎదుర్కొందా? వంటి ఆసక్తిర విషయాల కథే రెబల్ మూన్ ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్.

విశ్లేషణ:

హాలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రాలను అందించిన జాక్ స్నైడర్ నుంచి ఓ మూవీ వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అలాంటిది రెబల్ మూన్ అనేది జాక్ స్నైడర్ ప్రతిష్టాత్మక చిత్రమని ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ సినిమాపై ఇంతకుముందు సినిమాలకంటే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ, జాక్ స్నైడర్ ఆంబిషియస్ సినిమాగా రెబల్ మూన్ లేదు. అంతటి ఎక్స్‌పెక్టెషన్స్‌తో సినిమా చూస్తే వారికి నిరాశే మిగులుతుంది. కానీ, నార్మల్ మూవీగా చూస్తే మాత్రం ఓవరాల్‌గా రెబల్ మూన్ ఆకట్టుకుంటుంది.

యువతి పోరాటమే

అయితే రెబల్ మూన్ సినిమా స్టార్ వార్స్, డ్యూన్ వంటి స్కై ఫై మూవీస్ కాన్సెప్ట్‌తో చిత్రీకరించినట్లుగా ఎక్కువ అనిపిస్తుంది. వాటి నుంచే కథ, పాత్రలు, వాటి తీరు స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే మరో స్టార్ వార్స్ ఫ్రాంఛైజీలా రెబల్ మూన్ ఉంది. ఇక కథ విషయానికొస్తే అతి క్రూరంగా, నియంతృత పాలన చేసే అధికారిని, తన సైన్యాన్ని ఓడించేందుకు కొంతమంది యోధులతో కోరా అనే యువతి చేసే పోరాటమే రెబల్ మూన్.

కోరా నివసిస్తున్న గ్రామ పెద్దను నోబుల్ చంపడం, తర్వాత ఒక్కో యోధులను కనిపెట్టి కలుసుకోవడం, అంతకుముందు నోబుల్‌పై తిరుగుబాటు చేసిన అక్కా తమ్ముళ్లు డేవ్రా (క్లియోపాత్రా కోల్మాన్) డేరియన్ బ్లడాక్స్ (రే ఫిషర్)ను కలుసుకోవడం వంటి సీన్లతో చాలా ఆసక్తిగా నడుస్తుంది. ఇక తారక్, నెమిసిస్ వంటి పాత్రలను కలుసుకునేటప్పుడు వారు చేసే యాక్షన్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. వింత జీవులు కనిపిస్తూ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నెమిసిస్ యాక్షన్ ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

ఫైటింగ్ ఎపిసోడ్స్ అదుర్స్

రెబల్ మూన్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. ఫైట్స్ మధ్యలో వచ్చే స్లో మోషన్ షాట్స్ బాగున్నాయి. రెబల్ మూన్ సినిమాటోగ్రఫీ అదిరిపోవడంతోపాటు విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. సినిమాలో కనిపించే గ్రాఫిక్స్ ఐ ట్రీట్ ఇస్తాయి. ఇక క్లైమాక్స్‌లో కొంత ఊహించేలా ఉన్నా.. పాత్రల మధ్య ఎమోషన్ ఆకట్టుకునేలా ఉంది. నోబుల్, కోరా మధ్య వచ్చే ఫైట్ సీన్ మంచి థ్రిల్లింగ్ ఇస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు.

అయితే, తారక్, నెమిసిస్, జెనరల్ టైటిస్, రెబల్స్ పాత్రలను పూర్తిగా చూపించలేదు. కొద్దిపాటి డైలాగ్స్‌తో వారి గురించి చెప్పారు అంతే. అయితే సినిమాకు సెకండ్ పార్ట్ రెబల్ మూన్ ది స్కార్‌గివర్‌లో వారి గురించి పూర్తిగా చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోరా గతం బాగుంది. రెబల్ మూన్‌లో కోరా, నోబుల్ క్యారెక్టర్స్ హైలెట్ అని చెప్పొచ్చు. నోబుల్‌గా అత్యంత క్రూరుడిగా ఎడ్ స్క్రీన్ జీవించేశాడు. తన డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో పాత్రలోని క్రూరత్వాన్ని బాగా చూపించాడు.

హీరోయిన్ స్క్రీన్ ప్రజెన్స్

ఇక అతనికి ధీటుగా కోరా, అర్థేలేటిస్‌గా హీరోయిన్ సోఫియా బౌటెల్ల అదరగొట్టింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ప్రతిసారి ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌ వావ్ అనిపించేలా చేసింది. ఫైనల్‌గా చెప్పాలంటే డైరెక్టర్ జాక్ స్నైడర్ స్థాయి మూవీ కాదు. ఎన్నో సూపర్ హీరో మూవీస్ చేసిన జాక్ గత సినిమాలతో పోలిస్తే రెబల్ మూన్ తక్కువే అనొచ్చు. కానీ, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఆర్మీ ఆఫ్ ది డెడ్ మూవీ కంటే రెబల్ మూన్ చాలా బెటర్. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేకుండా ఉన్న ఈ స్కై ఫి యాక్షన్ థ్రిల్లర్‌ను వీకెండ్‌లో ఫ్యామిలీతో కచ్చితంగా చూడొచ్చు.

రేటింగ్: 2.75/5