Chaari 111 OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన వెన్నెల కిషోర్ యాక్షన్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Chaari 111 OTT: వెన్నెలకిషోర్ హీరోగా నటించిన కామెడీ మూవీ చారి 111 ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ టాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Chaari 111 OTT: వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారి 111 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. స్పై యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించాడు. మార్చి 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మోస్తారు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద డిజపాయింట్ చేసింది.
అమెజాన్ ప్రైమ్‌లో...
శుక్రవారం చారి 111 మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ ఏం లేకుండా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. చారి 111 మూవీలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా నటించింది. మురళీశర్మ, సత్య, తాగుబోతు రమేష్ కీలక పాత్ర పోషించారు.
ఓటీటీ కోసమే...
స్పై అంశాలకు కామెడీని జోడించి డైరెక్టర్ కీర్తికుమార్ చారి 111 మూవీని తెరకెక్కించాడు. ఇందులో చారి అనే గూఢచారిగా తన కామెడీ టైమింగ్‌తో వెన్నెలకిషోర్ ఆకట్టుకున్నాడు. ఎంతటి సీరియస్ ఇష్యూను అయినా సిల్లీగా మార్చే స్పైగా వెన్నెలకిషోర్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ బాగా డిజైన్ చేసుకున్నాడు.
ఎన్ఐ ఏ రా వంటి ఇన్వేస్టిగేషన్ సంస్థలు చేస్తోన్న పరిశోధనను ఫన్నీగా సినిమాలో చూపించడాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. చారి 111 మూవీని ఓటీటీ కోసమే తెరకెక్కించినట్లు ప్రచారం జరిగింది. వెన్నెలకిషోర్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని థియేటర్లలో రిలీజ్ చేసినట్లు సమాచారం. మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ స్ఫూర్తితో చారి 111 తెరకెక్కినట్లు ప్రచారం జరిగింద.
చారి 111 కథ ఇదే...
రుద్రనేత్ర పేరుతో ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్‌రావు నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీను ఏర్పాటుచేస్తాడు ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్) . హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో బాంబ్‌బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును రుద్రనేత్రకు చెందిన స్పెషల్ ఏజెంట్ చారి (వెన్నెలకిషోర్) చేపడతాడు.
సీరియస్ ఇష్యూను సిల్లీగా, సిల్లీ కేసును సీరియస్‌గా డీల్ చేయడం చారి స్పెషాలిటీ. ఈ బాంబు బ్లాస్ట్ కేసులోని అసలైన నేరస్తులను చారి కనిపెట్టాడా? కెమికల్ క్యాప్సుల్స్‌తో బాంబు బ్లాస్ట్‌లకు పాల్పడుతోన్న రావణ్‌కు ప్రసాదరావుతో ఉన్న సంబంధం ఏమిటి? చారితో పాటు మరో ఏజెంట్ ఈషా (సంయుక్త విశ్వనాథన్) రావణ్‌ను పట్టుకున్నారా? సీరియస్ కేసు సాల్వ్ చేసే క్రమంలో చారి చనిపోయాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్...
చారి 111 తర్వాత శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ అనే సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు వెన్నెలకిషోర్. ఇందులో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. డిటెక్టివ్ బ్యాక్‌డ్రాప్‌లో కంప్లీట్ శ్రీకాకుళం యాసలో రూపొందిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ రిలీజ్‌కు సిద్ధమైంది.
ఫ్యామిలీ స్టార్‌లో...
ప్రస్తుతం తెలుగులో పలు భారీ బడ్జెట్ సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూ వెన్నెలకిషోర్ బిజీగా ఉన్నాడు. శుక్రవారం రిలీజైన ఫ్యామిలీ స్టార్ మూవీలో వెన్నెలకిషోర్ మెయిన్ కమెడియన్‌గా కనిపించాడు. సంక్రాంతికి రిలీజైన మహేష్ బాబు గుంటూరు కారంతో ప్రేక్షకుల్ని నవ్వించాడు. కమల్‌హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 మూవీతో వెన్నెలకిషోర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
టాపిక్