OTT Bold Movie: ఓటీటీలో మాత్రమే చూడాల్సిన తెలుగు బోల్డ్ మూవీ.. రెండింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?-telugu bold movie love mouli ott streaming on aha amazon prime navdeep love mouli ott release ott movies ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Movie: ఓటీటీలో మాత్రమే చూడాల్సిన తెలుగు బోల్డ్ మూవీ.. రెండింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

OTT Bold Movie: ఓటీటీలో మాత్రమే చూడాల్సిన తెలుగు బోల్డ్ మూవీ.. రెండింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

Love Mouli OTT Streaming: థియేటర్లలో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే చూడాల్సిన తెలుగు బోల్డ్ మూవీ లవ్ మౌళి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. నవదీప్ నటించిన ఈ లవ్ మౌళి మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలో మాత్రమే చూడాల్సిన తెలుగు బోల్డ్ మూవీ.. రెండింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Love Mouli OTT Release: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, ఫాంటసీ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో కొన్ని బోల్డ్ సినిమాలకు సైతం అంతే రీచ్ ఉంటుంది. అయితే, ఇలాంటి సినిమాలను ఎక్కువగా థియేటర్లలో, ఫ్యామిలీతో చూసేందుకు సగటు ప్రేక్షకుడు ఇబ్బందిపడుతాడు. అందుకే వీటిని థియేటర్లలో కాకుండా ఓటీటీలో ఒంటరిగా చూడాలనుకుంటారు.

పరిమితికి మంచిన బోల్డ్ సీన్స్ ఉంటే పర్లేదు కానీ, మరి ఊర మాస్ ఘాటు సీన్స్ ఉంటే మాత్రం థియేటర్లలో అందరిముందు కళ్లు మూసుకోవాల్సింది. అందుకే అలాంటి ఓ సినిమా థియేటర్లలో విడుదలైన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ మూవీని ఎలాగు ఓటీటీలోనే చూడాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు అవైడ్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఆ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్స్, డిజిటల్ స్టీమింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సినిమా ఏదో కాదు నవదీప్ చాలా కాలం తర్వాత హీరోగా చేసిన లవ్ మౌళి. ఈ సినిమాను దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అవనీంద్ర తెరకెక్కించారు. రాజమౌళి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన అవనీంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించిన ఈ సినిమా జూన్ 7న థియేటర్లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ, ప్రీమియర్ షోలలో బోల్డ్ మూవీ లవ్ మౌళి అమ్మాయిలకు విపరీతంగా నచ్చిందని నవదీప్, డైరెక్టర్ అవనీంద్ర చెప్పుకొచ్చారు.

థియేటర్లలో ఊహించని ఫలితం అందుకున్న లవ్ మౌళి సినిమా ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా రెండు ఓటీటీల్లో. ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో లవ్ మౌళి డిజిటల్ ప్రీమియర్ కానుంది. అందుకు 50 రోజుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారట. అంటే, థియేట్రికల్ పూర్తయిన 50 రోజులకు ఓటీటీలోకి ఎంట్రీ కానుంది లవ్ మౌళి సినిమా.

అంటే, లవ్ మౌళి సినిమా జూలై చివరి వారంలో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. ఇది పక్కన పెడితే.. మిక్స్‌డ్, నెగెటివ్‌తోపాటు హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం నెలలోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లవ్ మౌళి 50 రోజుల వరకు ఆగకుండా నెలలోపే ఓటీటీలోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి.

కాబట్టి, ఓటీటీలో మాత్రమే చూడాల్సిన ఈ బోల్డ్ మూవీ లవ్ మౌళిని జూన్ చివరి వారంలో, లేదా జూలై మొదటి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి సడెన్‌గా అనౌన్స్‌మెంట్ కానీ, లేదా సైలెంట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా లవ్ మౌళి సినిమాలో నవదీప్‌కు జంటగా పంఖురి గిద్వానీ, చార్వీ దత్తా, భావనా సాగి హీరోయిన్స్‌గా చేశారు. అలాగే టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి అఘోరా పాత్రలో కెమియో ఎంట్రీ ఇచ్చారు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి సీ స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.