Gam Gam Ganesha Twitter Review: గం గం గణేశా ట్విట్టర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?
Gam Gam Ganesha Twitter Movie Review Telugu: బేబి మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గం గం గణేశా. కామెడీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో గం గం గణేశా ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
Gam Gam Ganesha Twitter Movie Review: బేబి మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన తొలి మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పుష్పక విమానంతో పర్వాలేదనిపించుకున్నాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి ఓటీటీ మూవీతో మంచి విజయం సాధించాడు.
కానీ, వీటితో రాని క్రేజ్ బేబి సినిమాతోనే ఆనంద్ దేవరకొండకు వచ్చింది. అలాంటి బేబి తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గం గం గణేశా. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జోడీగా ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌గా నటించారు.
గం గం గణేశా సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఈ సినిమా ఇవాళ అంటే మే 31న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. కానీ, ఈపాటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. అవి చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు సినిమాపై రివ్యూ ఇస్తున్నారు. మరి ఆనంద్ దేవరకొండ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో గం గం గణేశా ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.
"డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ మూవీ గం గం గణేశా డీసెంట్ సినిమా. కానీ, కొన్ని చోట్ల అసంబద్ధ నెరేషన్ సినిమాకు ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ సెకండాఫ్‌లోని ఊహించని ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఆడియెన్స్‌కు మంచి థ్రిల్‌ను పంచేలా ఉంది. ఆనంద్ దేవరకొండ బాగా చేశాడు. అలాగే ఇమ్మాన్యూయెల్‌తో ఇతరులు బాగా యాప్ట్ అయ్యారు. బీజీఎమ్ మెచ్చుదోగినట్లుగా ఉంది" అని ఓ రివ్యూ సంస్థ తెలిపింది.
"సింపుల్ స్టోరీ. కానీ కంటెంట్ మిస్ అయింది. కొన్ని చోట్ల కామెడీ బాగుంది. ఆనంద్ దేవరకొండ నటనతో తన శక్తిమేరకు ప్రయత్నించాడు. కానీ, ఇందులో అప్ టు మార్క్ చేరుకోలేకపోయాడు. ఇమ్మాన్యుయెల్, వెన్నెల కిశోర్ పెద్ద ప్లస్ పాయింట్స్. అతను ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తుంటాడు. దాన్ని ప్రశంసించాలి" అని ఒకరు రాసుకొచ్చారు.
"గం గం గణేశా సినిమా రిలాక్స్‌గా సీట్‌లో కూర్చుని ఎంజాయ్ చేసే ఫన్ క్రైమ్ కామెడీ సినిమా. సిచ్యువేషనల్‌గా వచ్చిన కామెడీ చాలా సూపర్బ్‌గా వర్కౌట్ అయింది. వెన్నెల కిశోర్ ట్రాక్ బాగా నవ్వు తెప్పించేలా ఉంది. బీజీఎమ్ అదిరిపోయింది. ఇది తెలిసిన స్టోరీనే అయినప్పటికీ డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి బ్రిలియంట్‌గా ఎగ్జిగ్యూట్ చేశారు. ఆనంద్ దేవరకొండ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతోంది" అని ఒక యూజర్ తెలిపాడు.
"గం గం గణేశా ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన ఒక ప్రాపర్ థ్రిల్లర్ కమర్షియల్ ప్యాకెజ్ మూవీ. ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, సెకండాఫ్ ట్విస్టులు, మంచి క్లైమాక్స్ చాలా పెద్దగా వర్కౌట్ అయ్యాయి. ఇమ్మాన్యూయెల్, కృష్ణ చైతన్య వారి పాత్రల్లో బెస్ట్ ఇచ్చారు" అని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు.
మరొకరు “కొండన్నకు హిట్ పడింది” అని రాసుకొచ్చారు. ఇలా ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమాకు ఎక్కువ మంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తుంటే కొంతమంది మాత్రం నెగెటివ్‌గా రాసుకొస్తున్నారు. ప్రస్తుతానికి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది ఈ మూవీ. అయితే, ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ శాతం ప్రేక్షకులకు నచ్చినట్లుగా తెలుస్తోంది.
టాపిక్