Vijayendra Prasad: రాజమౌళి తండ్రి హిట్ కొడుతున్నావ్ అన్నారు.. ఆనంద్ దేవరకొండ గం గం గణేశాడైరెక్టర్-gam gam ganesha director uday shetty about writer vijayendra prasad comments and anand deverakonda ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijayendra Prasad: రాజమౌళి తండ్రి హిట్ కొడుతున్నావ్ అన్నారు.. ఆనంద్ దేవరకొండ గం గం గణేశాడైరెక్టర్

Vijayendra Prasad: రాజమౌళి తండ్రి హిట్ కొడుతున్నావ్ అన్నారు.. ఆనంద్ దేవరకొండ గం గం గణేశాడైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
May 31, 2024 06:30 AM IST

Gam Gam Ganesha Director Uday Shetty Vijayendra Prasad: ఆనంద్ దేవరొండ నటించిన లేటెస్ట్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గం గం గణేశా. ఈ సినిమాతో హిట్ కొడుతున్నావ్ అని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లు గం గం గణేశా డైరెక్టర్ ఉదయ్ శెట్టి తెలిపారు.

రాజమౌళి తండ్రి హిట్ కొడుతున్నావ్ అన్నారు.. ఆనంద్ దేవరకొండ గం గం గణేశాడైరెక్టర్
రాజమౌళి తండ్రి హిట్ కొడుతున్నావ్ అన్నారు.. ఆనంద్ దేవరకొండ గం గం గణేశాడైరెక్టర్

Anand Deverakonda Gam Gam Ganesha Vijayendra Prasad: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం గం గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

"గం.. గం.. గణేశా" మే 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ కానున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి. ఇందులో దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి, రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ తమ సినిమాను ప్రశంసించడం గురించి చెప్పారు.

-నేను విజయేంద్ర ప్రసాద్ గారి టీమ్‌లో రైటర్‌గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్‌లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది.

- నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్‌కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా "గం.. గం.. గణేశా" జర్నీ బిగిన్ అయ్యింది.

-విజయేంద్రప్రసాద్ గారి పుట్టినరోజున విష్ చేసేందుకు వెళ్తే.. "గం.. గం.. గణేశా" కథను మరోసారి చెప్పించుకుని విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాతో హిట్ కొడుతున్నావ్ అని బ్లెస్ చేశారు. ఆయనకు మా కథ నచ్చడం నాలోని కాన్ఫిడెన్స్ పెంచింది. ఆనంద్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా "గం.. గం.. గణేశా" సినిమా చూశారు. వాళ్లకు మూవీ బాగా నచ్చింది.

-హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత కర్నూల్‌కు షిప్ట్ అవుతుంది. ఈ జర్నీలో సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హిలేరియస్‌గా వచ్చింది. ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్‌గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్‌ఫార్మ్ చేశారు.

-భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది "గం.. గం.. గణేశా"లో ఆసక్తికరంగా తెరకెక్కించాం. నేను ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్లేప్పటికే బేబి సినిమా షూట్ కు అయ్యి ఉంది. ఆ తర్వాత సమాంతరంగా "గం.. గం.. గణేశా" బేబి షూటింగ్ చేశాం.

-బేబిలో ఎమోషనల్ కంటెంట్, మా మూవీలో ఎనర్జిటిక్, కామెడీ క్యారెక్టర్ ఆనంద్ చేయాలి. ఈ రెండు సినిమాల మధ్య షిప్టింగ్ ఆనంద్‌కు ఛాలెంజింగ్ గా ఉండేది. బేబి సినిమా సక్సెస్ తర్వాత మా మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆనంద్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు. "గం.. గం.. గణేశా" సినిమాను కూడా త్వరగా థియేటర్స్‌లో చూడాలి అనే క్యూరియాసిటీ వారిలో ఏర్పడుతోంది.

Whats_app_banner