Rajamouli Mahabharat: రాజమౌళి మహాభారతం తీస్తాడా.. క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్-rajamouli to make mahabharat says vijayendra prasad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli Mahabharat: రాజమౌళి మహాభారతం తీస్తాడా.. క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్

Rajamouli Mahabharat: రాజమౌళి మహాభారతం తీస్తాడా.. క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్

Hari Prasad S HT Telugu
Jul 10, 2023 05:38 PM IST

Rajamouli Mahabharat: రాజమౌళి మహాభారతం తీస్తాడా? ఈ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు అతని తండ్రి, రచయిత, రాజ్యసభ సభ్యుడు అయిన విజయేంద్ర ప్రసాద్.

ఎస్ఎస్ రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి (AFP)

Rajamouli Mahabharat: దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతంపై సినిమా తీయబోతున్నాడని, అది పది భాగాలుగా రాబోతోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా. మరి అతడు ఆ సినిమా తీస్తాడా లేదా అన్న సందేహం చాలా మందికి ఉంది. తీస్తే అంతకన్నా అద్భుతం మరొకటి ఉండదని జక్కన్న అభిమానులూ భావిస్తున్నారు.

అయితే ఈ ప్రశ్నకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమాధానమిచ్చాడు. అతడు మహాభారతంపై సినిమా తీయబోతున్నాడని స్పష్టం చేశాడు. అయితే దీని గురించి ఇంకా ఎలాంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. పది భాగాలుగా మహాభారతాన్ని తీస్తాడని వార్తలు వచ్చినా.. ఒక్కో సినిమాకు రాజమౌళి తీసుకునే సమయం చూస్తే అది సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మొత్తానికి మహేష్ బాబుతో చేయబోయే మూవీ తర్వాత మహాభారత్ తీస్తాడని మాత్రం విజయేంద్ర ప్రసాద్ ధృవీకరించడం విశేషం. ఇక మహేష్ తో చేయబోయే సినిమా గురించి కూడా అతడు వెల్లడించాడు. ఈ అడ్వెంచర్ మూవీ ఆర్ఆర్ఆర్ కంటే కూడా ఘనంగా ఉండబోతోందని చెప్పాడు. ఈ సినిమాకు కూడా అతడే స్క్రిప్ట్ అందిస్తున్న విషయం తెలిసిందే.

రాజమౌళి, మహేష్ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ఈ మధ్యే రామాయణంపై వచ్చిన ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై తొలి రోజు నుంచే నెగటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

సంబంధిత కథనం

టాపిక్