SS Rajamouli: మహాభారతంపై సినిమా తీస్తా: రాజమౌళి
SS Rajamouli: రాజమౌళిలాంటి దర్శకుడు మహాభారతంపై సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన రాని అభిమాని అంటూ ఉండడు. భారీతనాన్ని తనదైన స్టైల్లో చూపించే ఈ జక్కన్న అలాంటి సినిమా తీయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
రాజమౌళి పేరు చెబితే ఓ ఈగ, ఓ బాహుబలి, ఓ ఆర్‌ఆర్‌ఆర్.. ఇలాంటి భారీ సినిమాలే గుర్తొస్తాయి. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అంటూ తెలియని ఏకైక దర్శకుడు అతడే. ఓ సినిమాను అందంగా చెక్కి, తీర్చదిద్దడంలో సిద్ధహస్తుడు రాజమౌళి. అందుకే జక్కన్న అనే నిక్‌నేమ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. బాహుబలి అయినా, ఆర్‌ఆర్‌ఆర్ అయినా సిల్వర్ స్క్రీన్‌పై భారీతనాన్ని అందంగా చూపించడంలో సక్సెసవుతూనే ఉన్నాడు.
అలాంటి రాజమౌళి మహాభారతంపై సినిమా తీస్తే కచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేస్తూ రాజమౌళియే తాను ఈ ఇతిహాసంపై సినిమా తీస్తానని ప్రకటించాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ వంద రోజులు అయిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మహాభారతం ప్రాజెక్ట్‌పై స్పందించాడు.
ఏదో ఒక రోజు ఈ మూవీ చేస్తానని చెప్పాడు. మహాభారతం అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా స్పష్టం చేశాడు. ఇండియన్ స్టోరీలను ప్రపంచానికి మరింత గొప్పగా, ఘనంగా చాటి చెప్పడానికి మహాభారతానికి మించింది ఏముంటుందని కూడా రాజమౌళి అన్నాడు. అయితే ఆ సినిమా తీయడానికి తనకు ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పాడు.
ఆ ప్రాజెక్ట్ చేపట్టే ముందు తాను కనీసం మరో మూడు, నాలుగు సినిమాలైనా తీస్తానని అన్నాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జక్కన్న.. మహేష్ బాబుతో తన తర్వాతి మూవీ చేయనున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్ నుంచి కూడా ఎన్నో ప్రశంసలు అందిన విషయం తెలిసిందే. ఈ మధ్యే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా అందుకుంది.
సంబంధిత కథనం