OTT Bold Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. ఒక్క బిడ్డ ఇద్దరు తండ్రులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bad Newz OTT Streaming: ఓటీటీలోకి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ బ్యాడ్ న్యూజ్ సడెన్‌గా వచ్చేసింది. యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు.
Bad Newz OTT Release: ఈ మధ్య కాలంలో బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలు ఎక్కువ అయ్యాయి. బోల్ట్ సీన్స్ పుష్కలంగా ఉన్న సినిమాలు తెలుగులో కూడా చాలా వరకు వస్తూనే ఉన్నాయి. అయితే, స్టోరీ కరెక్ట్‌గా ఉండి, కావాలని అతికించినట్లు బోల్డ్ సీన్స్ పెట్టకుండా సందర్భానుసారం వస్తే ఇంపుగా కనిపిస్తాయి.
కానీ, ఏదో ఒక సిచ్యువేషన్‌లో ఓ రొమాంటిక్ సీన్ పెట్టేసి రెండు, రెండున్నర గంటలు సినిమాను సర్దేయడం ఈ మధ్య ఎక్కువగా వచ్చే చిత్రాల్లో చూస్తున్నాం. ఇలాంటి సినిమాలు ముందు బజ్ క్రియేట్ చేసుకున్న విడుదల తర్వాత వాటిని ఆదరించేవారు కనుమరుగైపోతారు. అలా వచ్చి ప్లాప్‌గా మారిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, కొన్ని మాత్రం మంచి హిట్స్ సాధించాయి.
డిఫరెంట్ కాన్సెప్ట్
అలాంటి వాటిలో ఒకటే బ్యాడ్ న్యూజ్ మూవీ. ఎన్నో అంచనాలతో వచ్చి మౌత్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సంపాదించుకుంది ఈ సినిమా. బ్యాడ్ న్యూజ్ మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అందుకు కారణం ఇందులో యానిమల్ బ్యూటి, నయా నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి నటించడమే. అలాగే, ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండటంతో త్వరగా అందరికీ రీచ్ అయింది.
ఇక జూలై 19న థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్‌గా బాక్సాఫీస్ వద్ద రూ. 115.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి సడెన్‌గా, ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది.
బ్యాడ్ న్యూజ్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇక్కడ ఓటీటీ సంస్థ చిన్న ట్విస్ట్ పెట్టింది. ఈ సినిమాను రెంటల్ విధానంలో ఓటీటీ రిలీజ్ చేసింది. బ్యాడ్ న్యూజ్ మూవీని చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ మాత్రమే ఉంటే సరిపోదు. రూ. 349 చెల్లించాల్సిందే. అలాగే ప్రస్తుతానికి బ్యాడ్ న్యూజ్ హిందీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రమే డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
ఇద్దరు తండ్రులు
ఇదిలా ఉంటే, బ్యాడ్ న్యూజ్ కథలోకి వెళితే.. హీరోయిన్ ఇందులో ఇద్దరు హీరోలతో శృంగారంలో పాల్గొంటుంది. దాంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే, ఇద్దరు హీరోల స్పెర్మ్ హీరోయిన్ గర్భాశయంలో ఒక అండంగా ఏర్పడుతుంది. దాంతో హీరోయిన్‌కు ఇద్దరు భర్తలు, పుట్టబోయే బిడ్డకు ఇద్దరు తండ్రులు ఉంటారు.
దీంతో హీరోయిన్‌ను దక్కించుకునేందుకు ఇద్దరు హీరోలు ఎలా పోటీ పడ్డారు, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారనేదే సినిమా స్టోరీ. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు మేకర్స్ చెప్పారు. సీరియస్‌గా కనిపించే ఈ స్టోరీని చాలా ఫన్నీగా, కామెడీ, హాట్ హాట్ బోల్డ్ సీన్స్‌తో ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
కాగా ఆనంద్ తివారి దర్శకత్వం వహించిన బ్యాడ్ న్యూజ్‌లో తృప్తి దిమ్రితోపాటు విక్కీ కౌశల్, అమీ విర్క్, నేహా ధూపియా, కరణ్ అజ్లా, తరుణ్ దడేజా కీలక పాత్రలు పోషించారు. ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా క్రియేటివ్, అమెజాన్ ప్రైమ్ సంస్థల బ్యానర్స్‌పై కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ్ మెహతా, ఆనంద్ తివారి నిర్మించారు.