Stree 2 Box Office: కల్కి 2898 ఏడీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బ్రేక్ చేసిన హారర్ కామెడీ మూవీ.. నెక్ట్స్ టార్గెట్ యానిమల్!
Stree 2 Movie 16 Days Worldwide Box Office Collection: ఆగస్ట్ 15న విడుదలై ఇప్పటికీ అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది బాలీవుడ్ కామెడీ హారర్ మూవీ స్త్రీ 2. అంతేకాకుండా కల్కి 2898 ఏడీ లైఫ్‌టైమ్ హిందీ కలెక్షన్స్‌ను బ్రేక్ చేసింది స్త్రీ 2 చిత్రం. ఇక స్త్రీ 2కి 16 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే..
Stree 2 Collection Worldwide: కామెడీ హారర్ జోనర్‌లో వచ్చిన స్త్రీ 2 మూవీ ఆగస్ట్ 15న విడుదలై రెండు వారాలు కావొస్తున్న బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. విడుదలైన 16వ రోజున ఈ సినిమా ఇండియాలో రూ. 8.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇలా ఈ సినిమా దేశీయంగా మొత్తం రూ. 441.3 కోట్ల డొమెస్టిక్ నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
4 వేల షోల ప్రదర్శన
అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2 మూవీ శుక్రవారం (ఆగస్ట్ 30) నాడు మొత్తం 17.25% థియేటర్ హిందీ ఆక్యుపెన్సీని సాధించింది. అయితే, నైట్ షోస్ టికెట్స్ ఎక్కవగా అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్త్రీ 2 సినిమా మూడవ శుక్రవారం (ఆగస్ట్ 30) భారతదేశం అంతటా 4000 షోలు పడింది. ఈ చిత్రం ముంబైలో 968 షోలతో మొత్తం 18.5% ఆక్యుపెన్సీని సాధించింది.
ఆ తర్వాత ఢిల్లీ-NCRలో 18% ఆక్యుపెన్సీని సాధించింది. ఇక్కడ 1038 షోలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో దాదాపు 588 షోలు షెడ్యూల్ చేశారు. ఇలా దేశంలోనే అత్యధికంగా షోలు పడిన మూడో సినిమాగా స్త్రీ2 నిలిచింది. అహ్మాదాబాద్‌లో 16వ రోజున 12.25% ఆక్యుపెన్సీని సాధించింది. ఈ చిత్రం విడుదలైన 16 రోజుల్లో భారతదేశంలో రూ. 441.30 కోట్ల నికర వసూలు సాధించిందని, గ్రాస్ కలెక్షన్లు రూ. 527.15 కోట్లుగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రెండో అతిపెద్ద హిట్
స్త్రీ 2 ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులను బద్దలు కొట్టింది. మొత్తం కలెక్షన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు చేరుకున్నాయి. దీంతో కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ఆర్జించిన తర్వాత స్త్రీ 2 ఈ ఏడాది రెండవ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇక ఒరిజినల్ హిందీ చిత్రాల పరంగా స్త్రీ 2 విడుదలైన మొదటి వారంలోనే హృతిక్ రోషన్ ఫైటర్ లాంగ్ రన్ కలెక్షన్స్‌ను అధిగమించింది.
అలాగే బాహుబలి 2: ది కన్‌క్లూజన్ తర్వాత స్త్రీ 2 రెండవ అత్యధిక 2వ వారం కలెక్షన్‌లను కలిగి ఉన్న చిత్రంగా పేరుకెక్కింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2: ది కథా కంటిన్యూస్, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, రణబీర్ కపూర్ యానిమల్ వంటి చిత్రాలను సైతం అధిగమించింది ఈ హారర్ కామెడీ మూవీ స్త్రీ2. ఈ వారం పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో వారాంతంలో స్త్రీ2 మంచి వసూళ్లను సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కల్కి 2898 ఏడీ బ్రేక్
నాని సినిమాలకు నార్త్‌లో పెద్దగా పాపులారిటీ లేదు. కాబట్టి, సరిపోదా శనివారం మూవీ ఎఫెక్ట్ స్త్రీ2పై పడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే, కల్కి 2898 ఏడీ హిందీ బెల్ట్ లైఫ్ లాంగ్ కలెక్షన్స్ అయిన రూ. 291.13 కోట్లను స్త్రీ2 మూవీ బ్రేక్ చేసింది. ఇప్పుడు యానిమల్ హిందీ లాంగ్ రన్ గ్రాస్ కలెక్షన్స్ అయిన రూ. 662.33 కోట్లపై స్త్రీ 2 కన్నేసినట్లు తెలుస్తోంది.