OTT Movies: ఓటీటీలో 16 సినిమాలు- చూడాల్సినవి 6- హారర్, క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్ స్పెషల్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా అతి తక్కువగా 16 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. కానీ, వీటిలో ఆరు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. అందులోనూ ఫాంటసీ అడ్వెంచర్, హారర్ సినిమాలతోపాటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఎంగేజ్ చేయనున్నాయి.
This Week OTT Movies: మరో కొత్త వారం రానే వచ్చింది. అయితే, ఈ వారం థియేటర్లలో నాని సరిపోదా శనివారం వంటి పెద్ద సినిమానే సందడి చేయనుంది. దీంతోపాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ కానున్నప్పటికీ వాటికి పెద్దగా బజ్ లేదు. అలాగే ఈవారం సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 16 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
హెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 30
ది సెప్రెంట్ క్వీన్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్టింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 27
కానా కానుమ్ కాలంగల్ సీజన్ 3 (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30
జీ5 ఓటీటీ
ఇంటరాగేషన్ (హిందీ చిత్రం)- ఆగస్ట్ 30
ముర్షిద్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
పొలైట్ సొసైటీ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 28
ఐసీ814 ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 29
కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 29
టర్మినేటర్ జీరో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 29
బడ్డీ (తెలుగు మూవీ)- ఆగస్ట్ 30
జియో సినిమా ఓటీటీ
అబిగైల్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 26
గాడ్జిల్లా ఎక్స్ కింగ్: ది న్యూ ఎంపైర్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్ట్ 29
క్యాడేట్స్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30
పేచి (తమిళ హారర్ సినిమా)- ఆహా తమిళ ఓటీటీ- ఆగస్ట్ 29 (రూమర్ డేట్)
ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- ఆగస్ట్ 29
ఫాంటసీ అడ్వెంచర్ మూవీ
ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి అతి తక్కువగా 16 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వీటీలో అల్లు శిరీష్ నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ బడ్డీ తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్‌గా ఉండనుంది. దీంతోపాటు హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గాడ్జిల్లా ఎక్స్ కింగ్: ది న్యూ ఎంపైర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఇది చూసేందుకు జనాలు ఎగబడే అవకాశం ఉంది.
తమిళ హారర్ మూవీ
ఇక తమిళ హారర్ మూవీ పేచి కూడా మంచి క్రేజ్ సినిమ కానుంది. కానీ, ఆ సినిమా చూడాలంటే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. ఇదే కాకుండా హాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 కూడా ప్రత్యేకం కానుండగా.. కేకే మీనన్ నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ముర్షిద్ ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
అలాగే సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో ఐసీ814 ది కాందహార్ హైజాక్ మరింత స్పెషల్ కానుంది. ఇలా ఈ వారం 6 స్పెషల్ కానుండగా.. వాటిలో 4 సినిమాలు, 2 వెబ్ సిరీసులు ఉన్నాయి.