Jani Master: జానీ మాస్టర్‌పై కేసు వివాదం: బాధితురాలికి అండగా అల్లు అర్జున్?-jani master controversy allu arjun reportedly supporting victim and assures work in movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jani Master: జానీ మాస్టర్‌పై కేసు వివాదం: బాధితురాలికి అండగా అల్లు అర్జున్?

Jani Master: జానీ మాస్టర్‌పై కేసు వివాదం: బాధితురాలికి అండగా అల్లు అర్జున్?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 17, 2024 04:08 PM IST

Jani Master Case Controversy: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైగింక వేధింపుల కేసు నమోదైంది. ఈ అంశం దుమారాన్ని రేపుతోంది. అయితే, ఈ కేసులో బాధితురాలిగా అండగా అల్లు అర్జున్ నిలిచారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Jani Master: జానీ మాస్టర్‌పై కేసు వివాదం: బాధితురాలికి అండగా అల్లు అర్జున్?
Jani Master: జానీ మాస్టర్‌పై కేసు వివాదం: బాధితురాలికి అండగా అల్లు అర్జున్?

టాలీవుడ్‍లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం దుమారం రేపుతోంది. జానీ తనను చాలాసార్లు లైగింకంగా వేధించారంటూ ఆయన వద్ద అసిస్టెంట్‍గా చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై జానీపై పోలీసు కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

చాలా మంది స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు జానీ మాస్టర్. చాలా హిట్ పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. డ్యాన్ షో ఢీ ద్వారా వచ్చి టాలీవుడ్‍లో స్టార్ కొరియోగ్రాఫర్ రేంజ్‍కు వెళ్లారు. తమిళ సినిమాలకు కూడా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై లైగింక వేధింపుల ఆరోపణలు రావటం తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.

బాధిరాలికి అల్లు అర్జున్ మద్దతు?

జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా కొరియోగ్రాఫర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండగా నిలిచారంటూ సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆమె పుష్ప 2: ది రూల్ చిత్రానికి పని చేస్తున్నారని తెలుస్తోంది.

తాను నటించే తర్వాతి చిత్రాలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించే సినిమాల కోసం పని చేసేందుకు ఆ మహిళా కొరియోగ్రాఫర్‌కు అవకాశాలు ఇస్తామని మేనేజర్ ద్వారా అల్లు అర్జున్ తెలిపారనే విషయం వ్యాప్తి చెందుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

ఝాన్సీ వ్యాఖ్యలతో..

జానీ మాస్టర్ కేసు విషయంలో టాలీవుడ్ లైగింక వేధింపుల పరిష్కార ప్యానెల్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. యాంకర్, నటి ఝాన్సీ ఈ విషయంపై కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఓ పెద్ద హీరో.. బాధితురాలికి పని విషయంలో భరోసా ఇచ్చారని చెప్పారు.

తమ సినిమాల్లో పని చేసేందుకు అవకాశాలు ఇస్తామని ఆ అమ్మాయికి ఓ పెద్ద హీరో చెప్పినట్టు ఝాన్సీ వెల్లడించారు. “ఒక పెద్ద హీరో.. మేనేజర్ ద్వారా ఆమెకు సమాచారం ఇచ్చారు. మేం ఈ పోరాటంలో మీతో ఉంటామని, మీకు పని ఇస్తామని చెప్పారు” అని ఝాన్సీ వెల్లడించారు. ఆ పెద్ద హీరో అల్లు అర్జునే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీలో జానీ మాస్టర్ ఉన్నారు. అయితే, ఈ కేసు నమోదవగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీకి జనసేన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళకు అల్లు అర్జున్ మద్దతునిచ్చారని వైరల్ అవుతున్న విషయంలోనూ మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతోంది. ఏపీ ఎన్నికల నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనే రూమర్లు ఉన్నాయి. వైసీపీ నంద్యాల అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలుపడంతో సోషల్ మీడియాలో మొదలైన మెగా, అల్లు ఫ్యాన్స్ వార్ ఇంకా కొనసాగుతోంది.

కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సీక్వెల్ సినిమా డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Whats_app_banner